ఈ రాశి వారు ఆశయాలు సాధిస్తారు..

Daily Horoscope In Telugu 9-3-2021 - Sakshi

శ్రీ శార్వరి నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘ మాసం, తిథి బ.ఏకాదశి సా.4.22 వరకు, తదుపరి ద్వాదశి, నక్షత్రం ఉత్తరాషాఢ రా.9.58 వరకు, తదుపరి శ్రవణం, వర్జ్యం ఉ.6.23 నుండి 7.59 వరకు, తిరిగి రా.1.55 నుండి 3.30 వరకు, దుర్ముహూర్తం ఉ.8.37 నుండి 9.24 వరకు, తదుపరి రా.10.56 నుండి 11.45 వరకు అమృతఘడియలు... ప.3.44 నుంచి 5.16 వరకు.

సూర్యోదయం :    6.17
సూర్యాస్తమయం    :  6.04
రాహుకాలం :  ప. 3.00 నుంచి 4.30 వరకు
యమగండం :  ఉ.9.00 నుంచి 10.30 వరకు 

మేషం: కొత్త పనులు ప్రారంభిస్తారు. సంఘంలో గౌరవప్రతిష్ఠలు పెరుగుతాయి. విలువైన వస్తువులు సేకరిస్తారు. కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి. వ్యాపార వృద్ధి. ఉద్యోగాలలో ప్రోత్సాహం.

వృషభం: పనుల్లో ప్రతిబంధకాలు. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. ఆస్తి వివాదాలు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు. ఆలయాలు సందర్శిస్తారు.

మిథునం: పనుల్లో జాప్యం. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలలో ఒడిదుడుకులు. దైవదర్శనాలు. ఉద్యోగాలలో నిరుత్సాహం.

కర్కాటకం: చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. నిరుద్యోగుల ప్రయత్నాలు అనుకూలిస్తాయి. పరిస్థితులు అనుకూలిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత సాఫీగా సాగుతాయి.

సింహం: పరిచయాలు పెరుగుతాయి. ముఖ్యుల నుంచి  ఆసక్తికరమైన సమాచారం. పరపతి పెరుగుతుంది.  వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి. పుణ్యక్షేత్రాల సందర్శనం..

కన్య: ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. ఖర్చులు పెరుగుతాయి. కుటుంబసభ్యులతో విభేదాలు. వ్యాపారాలలో ఒత్తిడులు. ఉద్యోగాలలో చిక్కులు. అనారోగ్యం.

తుల: వ్యవహారాలలో ఇబ్బందులు. రుణాలు చేస్తారు. బంధువులతో విభేదాలు. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాలలో వివాదాలు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

వృశ్చికం: పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. కీలక నిర్ణయాలు. వాహనయోగం. ఆశయాలు సాధిస్తారు. సోదరుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో పొరపాట్లు.

ధనుస్సు: ఆర్థిక వ్యవహారాలలో ఆటంకాలు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలు మందగిస్తాయి.  ఆసక్తికరమైన సమాచారం. ఆరోగ్యభంగం.

మకరం: కొత్త పనులు సకాలంలో పూర్తి చేస్తారు. పరపతి పెరుగుతుంది. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ధి.

కుంభం: మిత్రులతో కలహాలు. ఆర్థిక ఇబ్బందులు. శ్రమకు ఫలితం కనిపించదు. దూరప్రయాణాలు. దైవదర్శనాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

మీనం: పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆకస్మిక ధనలబ్ధి. ముఖ్యమైన పనుల్లో విజయం. ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు.
 

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top