ఈ రాశి వారికి సన్నిహితుల నుంచి ధనలాభం.

Daily Horoscope In Telugu 7-3-2021 - Sakshi

శ్రీ శార్వరి నామ సంవత్సరం ఉత్తరాయణం, శిశిర ఋతువు మాఘ మాసం, తిథి బ.నవమి రా.7.36 వరకు, తదుపరి దశమి, నక్షత్రం మూల రా.11.40 వరకు, తదుపరి పూర్వాషాఢ వర్జ్యం ఉ.8.30 నుండి 10.02 వరకు దుర్ముహూర్తం సా.4.28 నుండి 5.15 వరకు, అమృతఘడియలు... సా.5.34 నుంచి 7.05 వరకు.

సూర్యోదయం        :  6.19
సూర్యాస్తమయం    :  6.03
రాహుకాలం :  సా.4.30 నుంచి 6.00 వరకు
యమగండం :  ప.12.00 నుంచి 1.30 వరకు 

మేషం : కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. ధనవ్యయం. ఆలయాల సందర్శనం. వృత్తి, వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. అనుకున్న వ్యవహారాలు ముందుకు సాగవు. దూరప్రయాణాలు.

వృషభం : పనుల్లో జాప్యం. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. వ్యయప్రయాసలు. బంధువులతో విభేదాలు. వృత్తి, వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి.  ఆరోగ్యభంగం.

మిథునం : కుటుంబంలో ఉత్సాహవంతంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో కొన్ని సర్దుబాట్లు చేసుకుంటారు. ఆస్తి వివాదాల పరిష్కారం. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.

కర్కాటకం : కుటుంబసభ్యులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. అనుకోని ప్రయాణాలు. అనారోగ్యం. శ్రమాధిక్యం. పనులు మధ్యలో విరమిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు..

సింహం : నూతన కార్యక్రమాలు చేపడతారు. శుభవార్తలు. ఆర్థిక వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. భూ, గృహయోగాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి.

కన్య : ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా. శ్రమాధిక్యం. బంధువులతో విభేదాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి. ఆరోగ్యసమస్యలు.

తుల : కొత్త పనులు చేపడతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం.

వృశ్చికం : ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల నుంచి ధనలాభం. కొత్త విషయాలు తెలుసుకుంటారు. పనుల్లో పురోగతి. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి..

ధనుస్సు : వ్యయప్రయాసలు.  వృత్తి, వ్యాపారాలలో గందరగోళం. సోదరులు, మిత్రులతో విభేదాలు. ఆధ్యాత్మిక చింతన.  ముఖ్యమైన పనులు వాయిదా. కుటుంబంలో ఒత్తిడులు.

మకరం : ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తాయి. పనులు వాయిదా వేస్తారు. శ్రమాధిక్యం. బంధువులతో వివాదాలు. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి. సోదరుల నుంచి ఒత్తిడులు.

కుంభం : కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. సన్నిహితులతో సఖ్యత. వాహనయోగం. భూలాభాలు. నూతన ఉద్యోగాలు దక్కవచ్చు.

మీనం : చిన్ననాటి మిత్రుల కలయిక. పనుల్లో విజయం. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు తొలగుతాయి. కుటుంబసౌఖ్యం. విందువినోదాలు. దైవదర్శనాలు. ఆహ్వానాలు అందుతాయి. 

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top