ఈ రాశివారికి కుటుంబసభ్యులతో కలహాలు

Daily Horoscope In Telugu 31 May 2021 - Sakshi

శ్రీ ప్లవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, తిథి బ.పంచమి ఉ.7.04 వరకు, తదుపరి షష్ఠి నక్షత్రం శ్రవణం రా.9.11 వరకు, తదుపరి ధనిష్ఠ, వర్జ్యం రా.1.02 నుంచి 2.34 వరకు, దుర్ముహూర్తం ప.12.21 నుంచి 1.15 వరకు, తదుపరి ప.2.59 నుంచి 3.51 వరకు, అమృత ఘడియలు ఉ.10.50 నుంచి 12.21 వరకు.

సూర్యోదయం :    5.28
సూర్యాస్తమయం    :  6.26
రాహుకాలం : ఉ. 7.30 నుంచి 9.00 వరకు
యమగండం :  ఉ.10.30 నుంచి 12.00 వరకు

రాశి ఫలాలు: 
మేషం: కొత్త పనులు ప్రారంభిస్తారు. యత్నకార్యసిద్ధి. పరపతి పెరుగుతుంది. మిత్రులతో ఆనందంగా గడుపుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు తీరతాయి.

వృషభం: కొన్ని పనులు వాయిదా. మిత్రులతో అకారణ వైరం. కుటుంబసమస్యలు. అనారోగ్యం. ఉద్యోగులకు చిక్కులు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.

మిథునం: బంధువిరోధాలు. ప్రయత్నాలు ముందుకు సాగవు. ఖర్చులు. ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి.  వ్యాపారాలు నిరాశ పరుస్తాయి. ఆరోగ్యసమస్యలు.

కర్కాటకం: దూరపు బంధువుల కలయిక. విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. చర్చలు సఫలం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి. 

సింహం: కొత్త పనులు చేపడతారు. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు. ఆహ్వానాలు రాగలవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది. 

కన్య: కుటుంబసమస్యలు. వ్యవహారాలలో ఆటంకాలు. దుబారా ఖర్చులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు. ఆలయ దర్శనాలు. అనారోగ్యం. 

తుల: పనులలో ఆటంకాలు. వృథా ఖర్చులు. అదనపు బాధ్యతలు. సోదరులు, మిత్రులతో వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త వివాదాలు. 

వృశ్చికం: పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. మిత్రులతో ఆనందంగా గడుపుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు సర్దుకుంటాయి.

ధనుస్సు: ఆకస్మిక ప్రయాణాలు. రుణాలు చేస్తారు. కష్టపడ్డా ఫలితం కనిపించదు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు. అనారోగ్యం. బంధువులతో విభేదాలు. 

మకరం: వ్యవహారాలు పూర్తి చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉన్నతస్థితి. కొత్త వ్యక్తుల పరిచయం. ఆలయాలు సందర్శిస్తారు. మిత్రులతో సఖ్యత నెలకొంటుంది.

కుంభం: కాంట్రాక్టులు చేజారతాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యవహారాలు మందగిస్తాయి. కుటుంబసభ్యులతో కలహాలు. ఆరోగ్యసమస్యలు.  వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.

మీనం: ఉద్యోగయత్నాలు సానుకూలం. వస్తులాభాలు. యత్నకార్యసిద్ధి. ఒక సమాచారం ఊరట కలిగిస్తుంది. వ్యాపారాలు పుంజుకుంటాయి.  ఉద్యోగాలలో కొత్త ఆశలు.
 

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top