గ్రహం అనుగ్రహం (30-10-2020)

Daily Horoscope In Telugu (30-10-2020) - Sakshi

శ్రీ శార్వరి నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు నిజ ఆశ్వయుజ మాసం, తిథి శు.చతుర్దశి సా.4.55 వరకు తదుపరి పౌర్ణమి, నక్షత్రం రేవతి ప.3.14 వరకు, తదుపరి అశ్వని వర్జ్యం... లేదు, దుర్ముహూర్తం ఉ.8.17 నుంచి 9.04 వరకు తదుపరి ప.12.06 నుంచి 12.53 వరకు అమృతఘడియలు... ప.12.34 నుంచి 2.20 వరకు.

సూర్యోదయం :    6.01
సూర్యాస్తమయం    :  5.27
రాహుకాలం : ఉ.10.30 నుంచి 12.00 వరకు
యమగండం :  ప.3.00 నుంచి 4.30 వరకు

మేషం: ఏ పని చేపట్టినా మందగిస్తుంది. దూరప్రయాణాలు. ఆర్థిక లావాదేవీలు నిరాశాజనకంగా ఉంటుంది. అనారోగ్య సూచనలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిళ్లు పెరుగుతాయి.

వృషభం:వ్యవహారాలలో విజయం. పలుకుబడి పెరుగుతుంది. ఒక సంఘటన ఆకట్టుకుంటుంది. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ఆటంకాలు తొలగుతాయి.

మిథునం: ప్రయాణాలు అనుకూలిస్తాయి. పరిచయాలు పెరుగుతాయి. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. ధనవ్యయం. ఆరోగ్యం మందగిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు.

కర్కాటకం: పరిస్థితులు అనుకూలించవు. వ్యవహారాలు కొన్ని ముందుకు సాగవు. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఆకస్మిక ప్రయాణాలు. రుణాలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.

సింహం: పనుల్లో స్వల్ప అవాంతరాలు. ఆర్థిక లావాదేవీలు కొంత నిరాశ పరుస్తాయి. ఇంటాబయటా ఒత్తిడులు. దైవదర్శనాలు. వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి. ఉద్యోగాలలో ఊహించని మార్పులు.

కన్య: కొత్త పనులు చేపడతారు. ఆహ్వానాలు అందుతాయి. వివాదాల నుంచి గట్టెక్కుతారు. ధనలాభం సూచనలు. ఆరోగ్యం కుదుటపడుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో పరిస్థితులు అనుకూలిస్తాయి.

తుల: శుభకార్యాలకు ప్రణాళిక రూపొందిస్తారు. వ్యవహారాలలో మరింత అనుకూలత. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆందోళన తొలగుతుంది.

వృశ్చికం: పనులు మధ్యలో విరమిస్తారు. శ్రమ తప్పదు. ఆకస్మిక ప్రయాణాలు. కొత్త రుణాలు చేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిదానిస్తాయి.

ధనుస్సు: బాధ్యతలు మరింత పెరుగుతాయి. కుటుంబసభ్యుల వైఖరి కొంత నిరాశ పరుస్తుంది. ధనవ్యయం. ఆకస్మిక ప్రయాణాలు. రుణాలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

మకరం: కొత్త పరిచయాలు. పోటీపరీక్షల్లో విజయం. స్నేహితులతో సఖ్యత. శుభవర్తమానాలు అందుతాయి. పనుల్లో విజయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు సర్దుబాటు కాగలవు.

కుంభం: దూరప్రయాణాలు. కుటుంబసభ్యులతో విభేదాలు. ఆర్థిక లావాదేవీలు నత్తనడకన సాగుతాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు కొద్దిపాటి లాభిస్తాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు.

మీనం: పలుకుబడి పెరుగుతుంది. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఇంటాబయటా మీదే పైచేయిగా ఉంటుంది. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి.
  

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top