గ్రహం అనుగ్రహం(30-09-2020)

Daily Horoscope In Telugu (30-09-2020) - Sakshi

    గ్రహం అనుగ్రహం

శ్రీ శార్వరి నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు అధిక ఆశ్వయుజ మాసం, తిథి శు.చతుర్దశి రా.11.34 వరకు తదుపరి పౌర్ణమి, నక్షత్రం పూర్వాభాద్ర రా.3.30 వరకు తదుపరి ఉత్తరాభాద్ర, వర్జ్యం ఉ.8.33 నుంచి 10.18 వర కు దుర్ముహూర్తం ప.11.26 నుంచి 12.15 వరకు అమృతఘడియలు... సా.6.54 నుంచి 7.56 వరకు.

సూర్యోదయం :    5.53
సూర్యాస్తమయం    :  5.49
రాహుకాలం :  ప. 12.00 నుంచి 1.30 వరకు
యమగండం :  ఉ.7.30 నుంచి 9.00 వరకు

రాశిఫలం:

మేషం: ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. మీ సత్తా చాటుకుంటారు. అప్రయత్న కార్యసిద్ధి. బంధువుల నుంచి సహాయం.  వ్యాపారులకు కొత్త ఆశలు.  ఉద్యోగాలలో ఉన్నతహోదాలు. 

వృషభం: కొత్త పనులు చేపడతారు. ఆలయాల దర్శనాలు.  కీలక సమాచారం. వ్యాపారాలలో పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో  సమస్యలు తీరతాయి. 

మిథునం: అనుకోని ధనవ్యయం. కొన్ని బాధ్యతలు చికాకు పరుస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారులకు ఒత్తిడులు. ఉద్యోగులకు మార్పులు. రాజకీయవేత్తలకు ఒత్తిళ్లు.

కర్కాటకం: కొన్ని పనులు మధ్యలో విరమిస్తారు. కష్టం ఎక్కువ ఫలితం తక్కువగా ఉంటుంది. ప్రయాణాలు. ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలలో  ఒడిదుడుకులు. ఉద్యోగాలలో  అనుకోని మార్పులు. 

సింహం: ఉత్సాహంగా ముందుకు సాగుతారు. ప్రముఖులతో పరిచయాలు. శుభవార్తలు అందుతాయి. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి. 

కన్య: ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలం. అందరిలోనూ గౌరవం. విలువైన వస్తువులు సేకరిస్తారు. అప్రయత్న కార్యసిద్ధి. శుభవర్తమానాలు. వ్యాపారాలలో పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు ఒత్తిడులు అధిగమిస్తారు.

తుల: పనులు ముందుకు సాగవు. ధనవ్యయం. శ్రమ ఎక్కువగా ఉంటుంది. బంధువులతో విభేదాలు. కుటుంబంలో ఒత్తిడులు. వ్యాపారాలలో చిక్కులు. ఉద్యోగాలలో కొంత గందరగోళం. 

వృశ్చికం: కొత్త బాధ్యతలు తలకెత్తుకుంటారు. పట్టుదలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. ప్రయాణాలు రద్దు చేసుకుంటారు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో పనిఒత్తిడులు.

ధనుస్సు: చిన్ననాటి మిత్రులను కలుస్తారు. శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. కొత్త్త కాంట్రాక్టులు పొందుతారు. ఆలయాలు సందర్శనం. వ్యాపారాలలో మరింతగా లాభాలు. ఉద్యోగాలలో ప్రోత్సాహం. .

మకరం: కుటుంబసమస్యలు. వివాదాలు తప్పవు. మిత్రుల నుంచి ఒత్తిడులు. ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలలో ఆటుపోట్లు. ఉద్యోగాలలో పనిభారం. 

కుంభం: కార్యజయం. ఆప్తులు, శ్రేయోభిలాషుల నుంచి సహాయం. అదనపు ఆదాయం. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో అనుకూలత.

మీనం: పనుల్లో అవాంతరాలు. ఆస్తి వివాదాలు. ఆర్థిక ఇబ్బందులు. స్వల్ప  అనారోగ్యం. దైవదర్శనాలు. వ్యాపారాలలో కొద్దిపాటి లాభాలు. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు.
 
 

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top