ఈ రాశి ఉద్యోగులకు అదనపు బాధ్యతలు

Daily Horoscope In Telugu 2nd June 2021 - Sakshi

శ్రీ ప్లవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు వైశాఖ మాసం, తిథి బ.అష్టమి, తె.5.12 వరకు (తెల్లవారితే గురువారం), తదుపరి నవమి, నక్షత్రం శతభిషం రా.9.18 వరకు, తదుపరి పూర్వాభాద్ర, వర్జ్యం. తె.3.54 నుంచి 5.32 వరకు (తెల్లవారితే గురువారం), దుర్ముహూర్తం ప.11.32 నుంచి 12.23 వరకు, అమృత ఘడియలు... ప.1.58 నుంచి 3.33 వరకు.

సూర్యోదయం :    5.28
సూర్యాస్తమయం    :  6.27
రాహుకాలం :  ప. 12.00 నుంచి 1.30 వరకు
యమగండం :  ఉ.7.30 నుంచి 9.00 వరకు

రాశి ఫలాలు: 
మేషం: పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారులకు అధిక లాభాలు. సోదరులు, మిత్రులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. ఆధ్యాత్మిక చింతన.

వృషభం: సంఘంలో గౌరవం. విలువైన సమాచారం. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభకార్యాలకు డబ్బు వెచ్చిస్తారు. ఉద్యోగులకు పదోన్నతులు.

మిథునం: మిత్రులతో మాటపట్టింపులు. దూరప్రయాణాలు. పనుల్లో జాప్యం. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. ఆలయాలు సందర్శిస్తారు.

కర్కాటకం: కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. ప్రయాణాలలో మార్పులు. ధనవ్యయం. కుటుంబసభ్యులతో వివాదాలు. ఆరోగ్యభంగం.

సింహం: నూతన వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. ఉద్యోగయోగం.

కన్య: చిన్ననాటి మిత్రుల నుంచి ధనలాభం. పోటీపరీక్షల్లో విజయం.  ఆసక్తికరమైన సమాచారం. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

తుల: కుటుంబంలో చికాకులు. అనుకోని ప్రయాణాలు. రుణాలు చేస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు. అనుకోని ధనవ్యయం.

వృశ్చికం: వ్యయప్రయాసలు. పనుల్లో స్వల్ప ఆటంకాలు. రుణాలు చేస్తారు. బంధువులతో మాటపట్టింపులు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.

ధనుస్సు: నూతన ఉద్యోగయోగం. కీలక నిర్ణయాలు. ఆస్తి వివాదాల పరిష్కారం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత. ప్రముఖులతో పరిచయాలు. దైవదర్శనాలు.

మకరం: రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. పనుల్లో జాప్యం. బంధువులు, మిత్రుల నుంచి ఒత్తిడులు. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు.

కుంభం: దూరపు బంధువుల కలయిక. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం. ఆస్తి లాభం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల మార్పులు. వస్తులాభాలు.

మీనం: ప్రయాణాలు వాయిదా వేస్తారు. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. ధనవ్యయం. కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు.
 

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top