గ్రహం అనుగ్రహం(29-09-2020)

Daily Horoscope In Telugu (29-09-2020) - Sakshi

 గ్రహం అనుగ్రహం

శ్రీ శార్వరి నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు అధిక ఆశ్వయుజ మాసం, తిథి శు.త్రయోదశి రా.10.22 వరకు తదుపరి చతుర్దశి, నక్షత్రం శతభిషం రా.1.40 వరకు, తదుపరి పూర్వాభాద్ర, వర్జ్యం ఉ.7.56 నుంచి 9.35 వరకు, దుర్ముహూర్తం ఉ.8.15 నుంచి 9.06 వరకు, తదుపరి రా.10.40 నుంచి 11.26 వరక, అమృతఘడియలు... సా.6.03 నుంచి 7.43 వరకు. యమగండం :  ఉ.9.00 నుంచి 10.30 వరకు

సూర్యోదయం:5.53
సూర్యాస్తమయం: 5.50
రాహుకాలం: ప. 3.00 నుంచి 4.30 వరకు

రాశిఫలం:
మేషం: పరిస్థితులు మరింత అనుకూలిస్తాయి. సంఘంలో పేరుప్రతిష్ఠలు పొందుతారు. అనుకున్న పనులు సమయానికి పూర్తి చేస్తారు. శుభవర్తమానాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం తొలగుతుంది.

వృషభం: చేపట్టిన పనులు ముందుకు సాగవు. ఆర్థిక వ్యవహారాలలో సమస్యలు. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. శ్రమాధిక్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో  మార్పులు ఉండవచ్చు.

మిథునం: దూరప్రయాణాలు. ఆస్తి వివాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. కుటుంబసభ్యులతో అకారణ విభేదాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు సాధారణంగా ఉంటాయి.

కర్కాటకం: నూతన వ్యక్తుల పరిచయం. శుభకార్యాల ప్రస్తావన. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకనమే. సన్నిహితులతో సఖ్యత నెలకొంటుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి.

సింహం: వ్యవహారాలలో పురోగతి. నూతన ఒప్పందాలు. ధన, వస్తులాభాలు. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. కుటుంబంలో చికాకులు తొలగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి.

కన్య: రుణయత్నాలు. దూరప్రయాణాలు. బంధువులు, మిత్రుల నుంచి ఒత్తిడులు. శ్రమాధిక్యం. కొన్ని పనులు వాయిదా వేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింతగా చికాకులు.

తుల....అనుకోని ప్రయాణాలు. మిత్రులతో కలహాలు. అనారోగ్యం. ఉద్యోగయత్నాలలో చికాకులు. దైవదర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత నిరాశ పరుస్తాయి.

వృశ్చికం: బంధువుల ద్వారా ధనలబ్ధి. విచిత్ర సంఘటనలు. ఆలోచనలు అమలు చేస్తారు. పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. వ్యాపారాలలో తగినంత లాభాలు. ఉద్యోగాలలో హోదాలు.

ధనుస్సు: వ్యవహారాలు మందగిస్తాయి. ప్రయాణాలు రద్దు చేసుకుంటారు. కొన్ని నిర్ణయాలు మార్చుకుంటారు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి.

మకరం: కుటుంబసభ్యుల ప్రోత్సాహం అందుతుంది. ఆర్థిక లావాదేవీలు ఉత్సాహపరుస్తాయి. శ్రమ ఫలిస్తుంది. వ్యవహారాలలో విజయం. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి.

కుంభం: సన్నిహితులతో మాటపట్టింపులు. ఆధ్యాత్మిక చింతన. ముఖ్యమైన పనులు ముందుకు సాగవు. ఆలోచనలు నిలకడగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంతవరకూ అనుకూలం.

మీనం: అప్రయత్న కార్యసిద్ధి. ప్రముఖుల సందేశాలు అందుతాయి. మిత్రులతో విభేదాలు పరిష్కారం. ఇంటాబయటా అనుకూలం. కొత్త వ్యక్తుల పరిచయం. వ్యాపారాలు, ఉద్యోగాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి.
 

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top