ఈ రాశివారికి ఆకస్మిక ధన,వస్తులాభాలు

Daily Horoscope In Telugu (28-1-2021) - Sakshi

శ్రీ శార్వరి నామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత ఋతువు పుష్య మాసం, తిథి పౌర్ణమి రా.12.46 వరకు, తదుపరి బ.పాడ్యమి నక్షత్రం పుష్యమి తె.4.17 వరకు (తెల్లవారితే శుక్రవారం), తదుపరి ఆశ్లేష, వర్జ్యం ప.11.55 నుంచి 1.31 వరకు, దుర్ముహూర్తం ఉ.10.20 నుంచి 11.05 వరకు, తదుపరి ప.2.51 నుంచి 3.33 వరకు అమృతఘడియలు... రా.9.44 నుంచి 11.22 వరకు.

సూర్యోదయం :    6.38
సూర్యాస్తమయం    :  5.49
రాహుకాలం : ప.1.30 నుంచి 3.00 వరకు
యమగండం :  ఉ.6.00 నుంచి 7.30 వరకు

మేషం : ఆర్థిక ఇబ్బందులు. కొత్త రుణయత్నాలు. ఆలోచనలు అంతగా కలసిరావు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు పెరుగుతాయి.

వృషభం : నూతన కార్యక్రమాలు చేపడతారు. ఆర్థికాభివృద్ధి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ఒప్పందాలు చేసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు తీరతాయి.

మిథునం : పరిస్థితులు అనుకూలిస్తాయి. కొన్ని వ్యవహారాలలో అవాంతరాలు. కొత్త రుణయత్నాలు. బంధువులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.

కర్కాటకం : పనుల్లో పురోగతి. ఆస్తులు కొనుగోలు చేస్తారు. ఆహ్వానాలు అందుతాయి. నూతన నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

సింహం : లేనిపోని వివాదాలు. ఆలోచనలు స్థిరంగా సాగవు. ఆకస్మిక ప్రయాణాలు. ఆర్థిక లావాదేవీలు మందగిస్తాయి. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు గందరగోళంగా ఉంటాయి.

కన్య : ఇంటర్వ్యూలు అందుతాయి. కొన్ని పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి పిలుపు. ఆకస్మిక ధన,వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.

తుల : మిత్రుల సలహాలు స్వీకరిస్తారు. నూతన ఉద్యోగప్రాప్తి. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త అవకాశాలు.

వృశ్చికం : ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. దూరప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. అనారోగ్యం. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగాలలో మార్పులు.

ధనుస్సు : నిరుద్యోగుల యత్నాలు ముందుకు సాగవు. ఆలోచనలు నిలకడగా ఉండవు. దూరప్రయాణాలు. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో లేనిపోని చికాకులు.

మకరం : కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. వాహనయోగం. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

కుంభం : పరిచయాలు పెరుగుతాయి. పనులు సజావుగా సాగుతాయి. ఆకస్మిక ధనలాభం. వాహనసౌఖ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా ఉంటాయి.

మీనం : వ్యవహారాలలో అవాంతరాలు. కుటుంబంలో చికాకులు. అనారోగ్యం. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాల విస్తరణ యత్నాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో మార్పులు.

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top