ఈ రాశివారికి పనులలో జాప్యం

Daily Horoscope In Telugu 26 May 2021 - Sakshi

శ్రీ ప్లవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు వైశాఖ మాసం, తిథి పౌర్ణమి, సా.5.24 వరకు, తదుపరి బ.పాడ్యమి, నక్షత్రం అనూరాధ రా.2.40 వరకు, తదుపరి జ్యేష్ఠ వర్జ్యం. ఉ.8.02 నుంచి 9.31 వరకు  దుర్ముహూర్తం ప.11.29 నుంచి 12.21 వరకు  అమృతఘడియలు... సా.4.58 నుంచి 6.28 వరకు.

సూర్యోదయం :    5.29
సూర్యాస్తమయం    :  6.24
రాహుకాలం :  ప. 12.00 నుంచి 1.30 వరకు
యమగండం :  ఉ.7.30 నుంచి 9.00 వరకు

రాశి ఫలాలు: 
మేషం:  ఆర్థిక పరిస్థితి కొంత నిరుత్సాహపరుస్తుంది. ధనవ్యయం.  శ్రమాధిక్యం. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు పెరుగుతాయి. ఆధ్యాత్మిక చింతన. 

వృషభం: విద్యార్థులకు అనుకూల ఫలితాలు. సంఘంలో గౌరవం. విలువైన వస్తువులు సేకరిస్తారు. బంధువుల తోడ్పాటు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

మిథునం: కొత్త పనులు ప్రారంభిస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి వృద్ధి. కీలక నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

కర్కాటకం: బంధువులతో మాటపట్టింపులు. ఆరోగ్యభంగం. పనులలో జాప్యం. వ్యయప్రయాసలు. వ్యాపారాలు,ఉద్యోగాలలో కొన్ని మార్పులు. దైవదర్శనాలు.

సింహం: దూరప్రయాణాలు. పనుల్లో జాప్యం. ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బంది కలిగిస్తుంది. అనుకోని ధనవ్యయం. పనులు వాయిదా వేస్తారు. ఆలోచనలు కలసిరావు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

కన్య: కొత్త పనులు చేపడతారు. బంధువుల నుంచి శుభవార్తలు. ఆర్థిక ప్రగతి. ప్రముఖులతో పరిచయాలు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి.

తుల: ఆర్థిక పరిస్థితి నిరాశాజనకంగా ఉంటుంది. ధనవ్యయం. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. అనారోగ్యం. బంధువులను కలుసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి.

వృశ్చికం: బంధువుల సలహాలు స్వీకరిస్తారు. ఆహ్వానాలు అందుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి. వస్తు, వస్త్రలాభాలు. 

ధనుస్సు: కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. 

మకరం: పనులలో విజయం. శుభవార్తలు అందుతాయి. శ్రమకు ఫలితం కనిపిస్తుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి. 

కుంభం:  ఉద్యోగయత్నాలు సానుకూలం. విలువైన వస్తువులు సేకరిస్తారు. బంధువుల కలయిక. ఆస్తిలాభం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత.

మీనం: ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక వ్యవహారాలలో నిరుత్సాహం. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి మార్పులు.

 

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top