ఈ రాశివారికి పనుల్లో విజయం

Daily Horoscope In Telugu 23-2-2021 - Sakshi

శ్రీ శార్వరి నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు మాఘ మాసం, తిథి శు.పంచమి తె.4.45 వరకు (తెల్లవారితే బుధవారం), తదుపరి షష్ఠి, నక్షత్రం రేవతి రా.8.23 వరకు, తదుపరి అశ్వని, వర్జ్యం ఉ.7.18 నుంచి 9.03 వరకు, దుర్ముహూర్తం ఉ.8.48 నుంచి 9.32 వరకు, తదుపరి రా.10.57 నుంచి 11.47 వరకు, అమృతఘడియలు... సా.5.46 నుంచి 7.31 వరకు, శ్రీపంచమి.

సూర్యోదయం :    6.31
సూర్యాస్తమయం    :  5.57
రాహుకాలం :  ప. 3.00 నుంచి 4.30 వరకు
యమగండం :  ఉ.9.00 నుంచి 10.30 వరకు 

మేషం: పనులు చకచకా సాగుతాయి. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తివృద్ధి. వ్యాపార, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు.

వృషభం: శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. ఆస్తి వివాదాలు. ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉంటుంది. వ్యాపార, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు. ఆలయాలు సందర్శిస్తారు.

మిథునం: కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. సోదరుల నుంచి కీలక సమాచారం. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపార, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి.

కర్కాటకం: కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. ఆర్థిక ఇబ్బందులు. రుణయత్నాలు. ఆలోచనలు కలిసిరావు. బాధ్యతలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక చింతన. వ్యాపార, ఉద్యోగాలలో నిరుత్సాహం

సింహం: పనులలో విజయం. శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం. ప్రముఖులతో పరిచయాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వృత్తి,వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. కళాకారులకు సన్మానాలు.

కన్య: సన్నిహితుల సాయం అందుతుంది. వ్యవహారాలలో విజయం. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వాహనయోగం. చర్చలు సఫలం. వృత్తి,వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.

తుల: శ్రమాధిక్యం. పనులలో తొందరపాటు. బాధ్యతలు పెరుగుతాయి. బంధువర్గంతో వివాదాలు. ఆలోచనలు కలసిరావు. వ్యాపార, ఉద్యోగాలలో కొద్దిపాటి మార్పులు.

వృశ్చికం: బంధువులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఇంటాబయటా నిరుత్సాహం. ఆరోగ్యభంగం. వృత్తి, వ్యాపారాలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి. శ్రమాధిక్యం. దైవచింతన.

ధనుస్సు: ఇంటాబయటా ప్రోత్సాహం. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు తీరతాయి. ఆహ్వానాలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. వృత్తి, వ్యాపారాలు సంతృప్తినిస్తాయి.

మకరం: ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. సోదరుల నుంచి శుభవార్తలు. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి.

కుంభం: కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. బాధ్యతలు పెరుగుతాయి. ఆలోచనలు కలిసిరావు. ఇంటాబయటా ఒత్తిడులు. వృత్తి,వ్యాపారాలు మందగిస్తాయి.

మీనం: ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. అనుకోని ధనవ్యయం. కుటుంబసభ్యులతో వివాదాలు. ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. 

 

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి



 

Read also in:
Back to Top