ఈ రాశి వారికి పనుల్లో తొందరపాటు

Daily Horoscope In Telugu 22-03-2021 - Sakshi

సోమవారం – 22.3.2021 – శ్రీశార్వరినామ సంవత్సరం. ఉత్తరాయణం, శిశిర ఋతువు. ఫాల్గుణ మాసం. తిథి శు.నవమి తె.5.32 వరకు(తెల్లవారితే మంగళవారం), తదుపరి దశమి. నక్షత్రం ఆరుద్ర సా.5.23 వరకు, తదుపరి పునర్వసు. వర్జ్యం లేదు. దుర్ముహూర్తం ప.12.32 నుంచి 1.20 వరకు, తదుపరి ప.2.54 నుంచి 3.44 వరకు. అమృత ఘడియలు ఉ.6.41 నుంచి 8.22 వరకు

సూర్యోదయం 6.07
సూర్యాస్తమయం 6.07
రాహుకాలం ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం ఉ.10.30 నుండి 12.00 వరకు 

రాశి ఫలాలు:
మేషం: పనుల్లో మరింత పురోగతి. ఆస్తుల విషయంలో చికాకులు తొలగుతాయి. ధనప్రాప్తి. సంఘంలో గౌరవం. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

వృషభం: సన్నిహితుల నుంచి సమస్యలు. కుటుంబంలో ఒత్తిడులు. ధనవ్యయం. దూరప్రయాణాలు. ఆర్థిక ఇబ్బందులు. వ్యాపారాలు నిరాశాజనకంగా ఉంటాయి. ఉద్యోగాలలో చిక్కులు.మిథునం...కార్యసిద్ధి. పలుకుబడి పెరుగుతుంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ఆస్తిలాభం. వాహనసౌఖ్యం. వ్యాపారాల విస్తరణలో ముందుకు సాగుతారు. ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందులు తొలగుతాయి.

కర్కాటకం: సన్నిహితులతో విభేదాలు. ఆర్థిక లావాదేవీలు నిరాశ పరుస్తాయి. శ్రమాధిక్యం. పనులు వాయిదాపడతాయి. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు సాధారణంగా ఉంటాయి.

సింహం: పరిస్థితులు అనుకూలిస్తాయి. నూతన విద్యావకాశాలు. పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.

కన్య: పన్లులో ముందడుగు వేస్తారు. కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వస్తు, వస్త్రలాభాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు అధిగమిస్తారు.

తుల: రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో తగాదాలు. కొన్ని వ్యవహారాలు నిరాశ పరుస్తాయి. అనారోగ్యం. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో ఊహించని మార్పులు.

వృశ్చికం: ఎంత శ్రమపడ్డా ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు నెలకొంటాయి. పనుల్లో తొందరపాటు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు తప్పవు.

ధనుస్సు: ఆర్థికాభివృద్ధి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. భూములు, వాహనాలు కొంటారు. చిన్ననాటి మిత్రుల ద్వారా శుభవార్తలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా ఉంటాయి.

మకరం: బంధువులతో తగాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. కుటుంబంలో ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు విస్తరణలో అవరోధాలు. ఉద్యోగాలలో పనిఒత్తిడులు.

కుంభం: రుణయత్నాలు సాగిస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. మిత్రులతో కలహాలు. ఆరోగ్యభంగం. కుటుంబంలో కొన్ని ఇబ్బందులు. వ్యాపారాలు, ఉద్యోగాలు గందరగోళపరుస్తాయి.

మీనం: అనుకున్న వ్యవహారాలు ముందుకు సాగవు. ఆలోచనలు పరిపరివి«ధాలుగా ఉంటాయి. ధనవ్యయం. కుటుంబసభ్యులతో విభేదాలు. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాలలో వివాదాలు.

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top