ఈ రాశివారికి ఒప్పందాలు వాయిదా వేస్తారు

Daily Horoscope In Telugu 20th July 2021 - Sakshi

శ్రీ ప్లవ నామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం, తిథి శు.ఏకాదశి సా.5.07 వరకు, తదుపరి ద్వాదశి నక్షత్రం అనూరాధ రా.7.19 వరకు, తదుపరి జ్యేష్ఠ, వర్జ్యం రా.12.30 నుండి 2.01 వరకు, దుర్ముహూర్తం ఉ.8.14 నుండి 9.05 వరకు తదుపరి రా.10.58 నుండి  11.44 వరకు, అమృతఘడియలు... ఉ.9.36 నుండి 11.04 వరకు, తొలి ఏకాదశి (శయన ఏకాదశి).

సూర్యోదయం :    5.38
సూర్యాస్తమయం    :  6.34
రాహుకాలం :  ప. 3.00 నుంచి 4.30 వరకు
యమగండం :  ఉ.9.00 నుంచి 10.30 వరకు

రాశి ఫలాలు: 

మేషం: చేపట్టిన పనుల్లో అవాంతరాలు. కొత్త రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశాజనకంగా సాగుతాయి.

వృషభం: కొత్త వ్యక్తులతో పరిచయాలు. సంఘంలో విశేష ఆదరణ. అప్రయత్న కార్యసిద్ధి. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

మిథునం: స్థిరాస్తుల వివాదాల పరిష్కారం. శుభవార్తలు వింటారు. బంధువుల ద్వారా ధనలాభం. విద్యార్థులకు నూతనోత్సాహం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు అధిగమిస్తారు.

కర్కాటకం: వ్యవహారాలలో ఆటంకాలు. ఖర్చులు పెరుగుతాయి. దూరప్రయాణాలు. బంధుమిత్రులతో విభేదాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరాశ.

సింహం: ప్రయాణాలు వాయిదా వేస్తారు. ఆలోచనలు కలసిరావు. కుటుంబసభ్యుల నుంచి సమస్యలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆకస్మిక మార్పులు.

కన్య: పరిచయాలు విస్తృతమవుతాయి. ఆర్థికాభివృద్ధి. కొత్త పనులు చేపడతారు. భూవివాదాలు పరిష్కరించుకుంటారు. వ్యాపారాలలో అభివృద్ధి. ఉద్యోగాలలో మరింత ప్రోత్సాహం.

తుల: ఆస్తి వివాదాలు నెలకొంటాయి. బంధుమిత్రులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

వృశ్చికం: శుభవార్తలు వింటారు. ధన, వస్తులాభాలు. చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం.

ధనుస్సు: కొత్తగా రుణాలు చేయాల్సిన పరిస్థితి. దూరప్రయాణాలు. ఒప్పందాలు వాయిదా వేస్తారు. పనుల్లో అవాంతరాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.

మకరం: రుణఒత్తిడులు తొలగుతాయి. ఆప్తుల నుంచి ఆహ్వానాలు. భూములు, వాహనాలు కొంటారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత అనుకూలిస్తాయి.

కుంభం: నూతన ఉద్యోగాలలో పురోగతి. సమావేశాలలో పాల్గొంటారు. రావలసిన డబ్బు అందుతుంది. వస్తులాభాలు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ఉన్నతపోస్టులు.

మీనం: ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. ఒప్పందాలు రద్దు చేసుకుంటారు. పనుల్లో ఆటంకాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త వివాదాలు.

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top