ఈ రాశివారికి ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది

Daily Horoscope In Telugu 20-04-2021 - Sakshi

శ్రీ ప్లవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు చైత్ర మాసం, తిథి శు.అష్టమి రా.7.11 వరకు, తదుపరి నవమి నక్షత్రం పుష్యమి రా.3.01 వరకు, తదుపరి ఆశ్లేష, వర్జ్యం ఉ.10.21 నుంచి 12.01 వరకు, దుర్ముహూర్తం ఉ.8.13 నుంచి 9.04 వరకు, తదుపరి రా.10.48 నుంచి 11.34 వరకు అమృతఘడియలు... రా.8.20 నుంచి 10.02 వరకు.

సూర్యోదయం :    5.46
సూర్యాస్తమయం    :  6.12
రాహుకాలం :  ప. 3.00 నుంచి 4.30 వరకు
యమగండం :  ఉ.9.00 నుంచి 10.30 వరకు

రాశి ఫలాలు:

మేషం: ఇంటాబయటా వ్యతిరేకత. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో ఒత్తిడులు. ఆథ్యాత్మిక చింతన. స్వల్ప అనారోగ్యం. వ్యాపారాలు సాదాసీదాగానే ఉంటాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు.

వృషభం: పరిస్థితులు అనుకూలిస్తాయి. సేవ, ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. ఆకస్మిక ధనలబ్ధి. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి.

మిథునం: ఆకస్మిక ప్రయాణాలు. ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. ఆరోగ్యం మందగిస్తుంది. శ్రమాధిక్యం. బంధువర్గంతో తగాదాలు. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాలలో మరిన్ని చికాకులు.

కర్కాటకం: వ్యతిరేకులు సైతం అనుకూలురుగా మారవచ్చు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆస్తి వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో హోదాలు పొందుతారు.

సింహం: వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. పనుల్లో అవాంతరాలు. రుణయత్నాలు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో కొన్ని మార్పులు అనివార్యం కావచ్చు.

కన్య: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. ఆస్తులు సమకూరతాయి. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. వ్యాపారాలు విస్తరించే యత్నాలు సఫలం. ఉద్యోగాలలో అనుకున్న మార్పులు ఉండవచ్చు.

తుల: నూతన ఉద్యోగప్రాప్తి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. దైవదర్శనాలు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగి ఊరట లభిస్తుంది.

వృశ్చికం: మిత్రులతో కలహాలు. కొత్త రుణయత్నాలు. దూరప్రయాణాలు. దైవదర్శనాలు. స్వల్ప అనారోగ్యం. వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి. ఉద్యోగాలలో పనిఒత్తిడులు పెరుగుతాయి. ఆలయ దర్శనాలు.

ధనుస్సు: రుణాలు సైతం చేస్తారు. ఆలోచనలు నిలకడగా సాగవు. అనారోగ్యం. సోదరులతో విభేదాలు. ముఖ్యమైన వ్యవహారాలు ముందుకు సాగవు. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.

మకరం: పరిచయాలు పెరుగుతాయి. ఆస్తుల వ్యవహారాలలో ఒప్పందాలు. పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో చికాకులు.

కుంభం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. వాహనయోగం. పనులు చకచకా సాగుతాయి. దూరపు బంధువుల కలయిక. వ్యాపారాలు నిదానిస్తాయి. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు తప్పకపోవచ్చు. 

మీనం: వ్యవహారాలలో ఆటంకాలు. దూరప్రయాణాలు. అనారోగ్యం. శ్రమాధిక్యం. బంధుమిత్రుల నుంచి ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు నిరాశాజనకంగా ఉంటాయి. ఉద్యోగాలలో చిక్కులు.
 

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top