ఈ రాశివారి వ్యాపారాలలో చికాకులు

Daily Horoscope In Telugu 1st June 2021 - Sakshi

శ్రీ ప్లవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు వైశాఖ మాసం, తిథి బ.షష్ఠి ఉ.5.56 వరకు, తదుపరి సప్తమి తె.5.24 వరకు, నక్షత్రం ధనిష్ఠ రా.8.54 వరకు, తదుపరి శతభిషం, వర్జ్యం తె.4.13 నుండి 5.52 వరకు, దుర్ముహూర్తం ఉ.8.04 నుండి 8.54 వరకు, తదుపరి రా.10.52 నుండి 11.34 వరకు, అమృతఘడియలు... ఉ.10.33 నుంచి 12.06 వరకు.

సూర్యోదయం :    5.28
సూర్యాస్తమయం    :  6.27
రాహుకాలం :  ప. 3.00 నుంచి 4.30 వరకు
యమగండం :  ఉ.9.00 నుంచి 10.30 వరకు

రాశి ఫలాలు: 
మేషం: కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రయత్నాలు అనుకూలిస్తాయి.సంఘంలో గౌరవం. విలువైన వస్తువులు కొంటారు. ఉద్యోగయోగం.

వృషభం: ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది.పనుల్లో స్వల్ప ఆటంకాలు. ధనవ్యయం. వ్యాపార, ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి. దైవచింతన.

మిథునం: పనులు నెమ్మదిగా సాగుతాయి. దూరప్రయాణాలు. వ్యయప్రయాసలు. కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. ఆరోగ్యభంగం.

కర్కాటకం: కొత్త కార్యక్రమాలు చేపడతారు. సోదరుల నుంచి కీలక సమాచారం. ఆహ్వానాలు. ఆర్థికాభివృద్ధి. ముఖ్య నిర్ణయాలు.

సింహం: ఉద్యోగయోగం. పనులలో విజయం. శుభవార్తలు. వ్యాపారాలు లాభిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు.

కన్య: శ్రమ పెరుగుతుంది. ధనవ్యయం. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు. దైవదర్శనాలు.

తుల: రుణఒత్తిడులు. ధనవ్యయం. వ్యాపారాలలో చికాకులు. ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు. ప్రయాణాలు వాయిదా. 

వృశ్చికం: పరిస్థితులు అనుకూలిస్తాయి. ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యవహారాలలో విజయం.శుభవార్తలు. ఆస్తి వివాదాల పరిష్కారం.

ధనుస్సు: కొత్త రుణాలు చేస్తారు. ప్రయాణాలు. బంధువులతో స్వల్ప వివాదాలు. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు పెరుగుతాయి.

మకరం: కుటుంబసౌఖ్యం. విలువైన సమాచారం. ఆలయాలు సందర్శిస్తారు. ఉద్యోగులకు పదోన్నతులు. వ్యాపారులకు అధిక లాభాలు.

కుంభం: వ్యవహారాలలో స్వల్ప ఆటంకాలు. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. వ్యాపార, ఉద్యోగాలలో మార్పులు. ధనవ్యయం.

మీనం: శుభవార్తలు. ఆర్థిక ప్రగతి. నూతన విషయాలు తెలుసుకుంటారు. ప్రయత్నాలు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రుల కలయిక.

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top