ఈ రాశి వారికి కొత్త వ్యక్తుల పరిచయం..

Daily Horoscope In Telugu (19-12-2020) - Sakshi

శ్రీ శార్వరి నామ సంవత్సరం, దక్షిణాయనం హేమంత ఋతువు, మార్గశిర మాసం, తిథి శు.పంచమి సా.5.07 వరకు, తదుపరి షష్ఠి, నక్షత్రం ధనిష్ఠ రా.10.57 వరకు, తదుపరి శతభిషం, వర్జ్యం... లేదు
దుర్ముహూర్తం ఉ.6.27 నుంచి 7.54 వరకు అమృతఘడియలు... ప.12.19 నుంచి 1.56 వరకు.

సూర్యోదయం :    6.28
సూర్యాస్తమయం    :  5.26
రాహుకాలం :  ఉ.9.00 నుంచి 10.30 వరకు
యమగండం :  ప.1.30 నుంచి 3.00 వరకు 

మేషం: వ్యవహారాలలో పురోగతి. కుటుంబంలో చిక్కులు తొలగుతాయి. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనూహ్యమైన అవకాశాలు.

వృషభం: అనుకున్న పనుల్లో మరింత పురోగతి. కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. నూతన ఉద్యోగాలు దక్కుతాయి. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి.

మిథునం: పనులు నెమ్మదిగా సాగుతాయి. ఆప్తులతో విభేదాలు. ఆర్థిక లావాదేవీలు మందగిస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు. ఒప్పందాలు వాయిదా. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.

కర్కాటకం: మిత్రులే శత్రువులుగా మారవచ్చు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో ఒత్తిడులు. స్వల్ప అనారోగ్యం. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు అంతగా అనుకూలించవు.

సింహం: కొత్త పనులు చేపడతారు. ఆత్మీయులు, బంధువులతో సఖ్యత. ఇంటాబయటా అనుకూలం. చర్చలు సఫలం. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో పనిభారం నుంచి విముక్తి.

కన్య: పలుకుబడి పెరుగుతుంది. ముఖ్యమైన పనుల్లో అనుకూలత. పరిచయాలు పెరుగుతాయి. ఆస్తులు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో హోదాలు.

తుల: పనుల్లో జాప్యం. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. కొత్త నిర్ణయాలు వాయిదా. శ్రమాధిక్యం. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరిన్ని సమస్యలు.

వృశ్చికం: వ్యయప్రయాసలు. దూరప్రయాణాలు. కొత్త రుణాలు చేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. పనుల్లో ఆటంకాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.

ధనుస్సు: శ్రమపడ్డా ఫలితం కనిపిస్తుంది. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆహ్వానాలు అందుకుంటారు. విలువైన సమాచారం. స్థిరాస్తిలాభం. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి.

మకరం: కొన్ని వ్యవహారాలు ముందుకు సాగవు. ప్రయాణాలు వాయిదా. ఆరోగ్యం మందగిస్తుంది. దైవచింతన. బంధువులతో మాటపట్టింపులు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాధారణంగా ఉంటాయి.

కుంభం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. ఆత్మీయుల ఆదరణ. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో అధిక లాభాలు. ఉద్యోగాలలో సంతోషకరమైన సమాచారం.

మీనం: అనుకోని ఖర్చులు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. శ్రమకు ఫలితం ఉండదు. వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో లేనిపోని ఇబ్బందులు.

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top