గ్రహం అనుగ్రహం (14-12-2020) 

Daily Horoscope In Telugu (14-12-2020) - Sakshi

గ్రహం అనుగ్రహం

శ్రీశార్వరినామ సంవత్సరం. దక్షిణాయనం, శరదృతువు. కార్తీక మాసం. తిథి అమావాస్య రా.10.15 వరకు, తదుపరి మార్గశిర శు.పాడ్యమి. నక్షత్రం జ్యేష్ఠ రా.12.33 వరకు, తదుపరి మూల. వర్జ్యం ఉ.7.09 నుంచి 8.40 వరకు. దుర్ముహూర్తం ప.12.15 నుంచి 1.01 వరకు, తదుపరి ప.2.27 నుంచి 3.11 వరకు.  అమృత ఘడియలు సా.4.13 నుంచి 5.44 వరకు.

రాహుకాలం ఉ.7.30 నుంచి 9.00 వరకు.
యమగండం ఉ.10.30 నుంచి 12.00 వరకు.
సూర్యోదయం 6.25. సూర్యాస్తమయం 5.24

రాశి ఫలాలు:
మేషం: దూరప్రయాణాలు . ఆరోగ్య, కుటుంబసమస్యలు. వివాదాలకు దూరంగా ఉండండి. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగులకు బదిలీలు. ఆలయాలు సందర్శిస్తారు.

వృషభం: కొత్త పనులు చేపడతారు. ఆర్థిక విషయాలు ఆశాజనకంగా ఉంటాయి. భూ వివాదాలు తీరతాయి. వ్యాపారాలు ఉత్సాహంగా ఉంటాయి. ఉద్యోగాలలో గందరగోళం తొలగుతుంది..

మిథునం: కొత్త వ్యక్తుల పరిచయం. ఆకస్మిక ధనలబ్ధి. పరిచయాలు పెరుగుతాయి. దైవదర్శనాలు. వ్యాపారాలలో అడుగు ముందుకు వేస్తారు. ఉద్యోగాలలో కొత్త ఆశలు. . 

కర్కాటకం: ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబసభ్యులతో వివాదాలు. ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని ఒత్తిడులు. నిరుద్యోగులకు నిరాశ..

సింహం: ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. సన్నిహితులు, మిత్రులతో  విభేదాలు.  ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. వ్యాపారాలలో  లాభాలు కష్టమే. ఉద్యోగాలలో పనిభారం. 

కన్య: చిరకాలమిత్రులను కలుసుకుంటారు. యత్నకార్యసిద్ధి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఊహించని పురోగతి. 

తుల: ప్రయాణాలు వాయిదా వేస్తారు. శ్రమాధిక్యం. వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి.. ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు. దైవదర్శనాలు చేసుకుంటారు.

వృశ్చికం: చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. యత్నకార్యసిద్ధి. శుభకార్యాలకు హాజరవుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి. ధనలాభం.

ధనుస్సు: పనుల్లో  అవాంతరాలు. అనారోగ్యం. కుటుంబసభ్యులతో తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. శ్రమ పెరుగుతుంది.

మకరం: కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థిక విషయాలు ఉత్సాహవంతంగా ఉంటాయి. పనుల్లో విజయం. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాల్లో ఒత్తిడులు తొలగుతాయి. 

కుంభం: ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. చిన్ననాటì  మిత్రులతో  సఖ్యత. ఉద్యోగాలు, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. వాహనయోగం. ఆధ్యాత్మిక చింతన.

మీనం: పనులు కొన్ని మందగిస్తాయి. ధనవ్యయం. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు. ఆలయాలు సందర్శిస్తారు. సోదరులతో కలహాలు.
 

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top