గ్రహం అనుగ్రహం (13-12-2020) 

Daily Horoscope In Telugu (13-12-2020) - Sakshi

గ్రహం అనుగ్రహం

శ్రీ శార్వరి నామ సంవత్సరం దక్షిణాయనం, శరదృతువు కార్తీక మాసం, తిథి బ.చతుర్దశి రా.12.17 వరకు, తదుపరి అమావాస్య, నక్షత్రం అనూరాధ రా.1.55 వరకు, తదుపరి జ్యేష్ఠ వర్జ్యం ఉ.7.10 నుంచి 8.40 వరకు దుర్ముహూర్తం సా.3.55 నుంచి 4.40 వరకు, అమృతఘడియలు... సా.4.09 నుంచి 5.41 వరకు.

సూర్యోదయం        :  6.25
సూర్యాస్తమయం    :  5.24
రాహుకాలం :  సా.4.30 నుంచి 6.00 వరకు
యమగండం :  ప.12.00 నుంచి 1.30 వరకు

రాశి ఫలలు: 
మేషం: పనుల్లో ఆటంకాలు. అనుకోని ఖర్చులు. బంధువిరోధాలు. ఆరోగ్యసమస్యలు. దూరప్రయాణాలు. వృత్తి, వ్యాపారాలలో అవరోధాలు. శ్రమ మరింత పెరుగుతుంది. ఆలయాలు సందర్శిస్తారు.

వృషభం: కార్యజయం. ఆస్తి, ధనలాభాలు. పాతమిత్రుల నుంచి ఆహ్వానాలు. కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వాహనయోగం.

మిథునం: పనులు చకచకా పూర్తి చేస్తాయి. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. ప్రముఖులతో పరిచయాలు. వృత్తి, వ్యాపారాలలో అనుకూల వాతావరణం. విద్యార్థులకు కొత్త ఆశలు. దైవదర్శనాలు.

కర్కాటకం: వ్యయప్రయాసలు. మిత్రులతో స్వల్ప వివాదాలు. అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. ఉద్యోగులకు శ్రమాధిక్యం.

సింహం: రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబసభ్యులతో విభేదాలు. శ్రమా«ధిక్యం. ఆరోగ్య సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి. ఆలయాలు సందర్శిస్తారు. 

కన్య: కొత్త విషయాలు తెలుసుకుంటారు. పోటీపరీక్షల్లో విజయం. ఆప్తులతో సఖ్యత. విలాసవంతంగా గడుపుతారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు హోదాలు. పరిస్థితులు అనుకూలిస్తాయి.

తుల: వ్యవహారాలు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసభ్యులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. వ్యయప్రయాసలు.

వృశ్చికం: రాబడి పెరుగుతుంది. వ్యవహారాలలో విజయం. ఆప్తుల నుంచి కీలక సమాచారం. ప్రముఖులతో పరిచయాలు. వృత్తి, వ్యాపారాలు అనుకూలిస్తాయి. సంఘంలో విశేష గౌరవం. భూలాభాలు.

ధనుస్సు: సోదరులతో వివాదాలు నెలకొంటాయి. రాబడి కంటే ఖర్చులు అధికం. పనుల్లో అవాంతరాలు. దూరప్రయాణాలు. వృత్తి, వ్యాపారాలు నిరాశ పరుస్తాయి. స్వల్ప అనారోగ్యం.

మకరం: కార్యజయం. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభవార్తలు. వాహనయోగం. విద్యార్థులకు కార్యసిద్ధి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు ఉన్నత పోస్టులు. కాంట్రాక్టులు దక్కుతాయి.

కుంభం: శ్రమ ఫలిస్తుంది. నూతన విద్యావకాశాలు. పరిచయాలు పెరుగుతాయి. యత్నకార్యసిద్ధి. కీలక నిర్ణయాలు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు

మీనం: వ్యవహారాలు మందగిస్తాయి. శ్రమ పెరుగుతుంది. బంధువిరోధాలు. కొన్ని సమస్యలు చికాకు పరుస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిళ్లు. విద్యార్థులకు గందరగోళం.

 

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top