గ్రహం అనుగ్రహం (12-10-2020)

Daily Horoscope In Telugu (12-10-2020) - Sakshi

శ్రీశార్వరినామ సంవత్సరం. దక్షిణాయనం, శరదృతువు. అధిక ఆశ్వయుజ మాసం. తిథి బ.దశమి ఉ.11.14 వరకు, తదుపరి ఏకాదశి. నక్షత్రం ఆశ్లేష రా.8.37 వరకు, తదుపరి మఖ. వర్జ్యం ఉ.9.34 నుంచి 11.09 వరకు. దుర్ముహూర్తం ప.12.10 నుంచి 12.55 వరకు,  తదుపరి ప.2.29 నుంచి 3.18 వరకు. అమృత ఘడియలు రా.7.02 నుంచి 8.36 వరకు.

సూర్యోదయం: 5.55 సూర్యాస్తమయం: 5.38 
రాహుకాలం :  ఉ.7.30 నుంచి  9.00 వరకు. 
యమగండం : ఉ.10.30 నుంచి 12.00 వరకు 

రాశిఫలం: 

మేషం: మిత్రులతో వివాదాలు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్య సమస్యలు. అనుకున్న పనులు ముందుకు సాగవు. వృత్తి, వ్యాపారాలు నిరాశ పరుస్తాయి.

వృషభం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. వాహనాలు, భూములు కొంటారు. వృత్తి, వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి.

మిథునం: కుటుంబసభ్యులతో విభేదాలు. అనారోగ్యం. వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు,  ఉద్యోగాలలో గందరగోళం.

కర్కాటకం: చిరకాల మిత్రులను కలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు. వస్తు, వస్త్రలాభాలు. ఇంటర్వ్యూలు అందుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

సింహం: రుణాలు చేస్తారు. ఆర్థిక విషయాలు నిరాశ కలిగిస్తాయి. శ్రమాధిక్యం. పనులలో ఆటంకాలు. వ్యయప్రయాసలు. వృత్తి,వ్యాపారాలలో ఒత్తిడులు.

కన్య: శ్రమ ఫలిస్తుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూలం.

తుల: కొత్త పనులకు శ్రీకారం. శుభకార్యాలలో పాల్గొంటారు. బాకీలు కొన్ని వసూలవుతాయి. అంచనాలు నిజమవుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం.

వృశ్చికం: బంధుమిత్రులతో వివాదాలు. ధనవ్యయం. అనారోగ్యం. దూరప్రయాణాలు. ఆస్తి వివాదాలు నెలకొంటాయి. వ్యాపార, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి.

ధనుస్సు: ఆకస్మిక ప్రయాణాలు. పనుల్లో జాప్యం. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి.

మకరం: వ్యతిరేకులు సైతం మిత్రులుగా మారతారు. వ్యవహారాలలో విజయం. ఆప్తుల నుంచి శుభవార్తలు. వ్యాపార, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి. వస్తులాభాలు.

కుంభం: పనులు చకచకా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. సంఘంలో గౌరవం. వస్తులాభాలు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.

మీనం: మిత్రులతో మాటపట్టింపులు. ఆలయ దర్శనాలు. అనారోగ్యం. ఆకస్మిక ప్రయాణాలు. ధనవ్యయం. వ్యాపార, ఉద్యోగాలలో నిరాశ తప్పదు.

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top