గ్రహం అనుగ్రహం (11-11-2020) 

Daily Horoscope In Telugu (11-11-2020) - Sakshi

శ్రీ శార్వరి నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు నిజ ఆశ్వయుజ మాసం, తిథి బ.ఏకాదశి రా.8.32 వరకు తదుపరి ద్వాదశి, నక్షత్రం ఉత్తర రా.1.32 వరకు, తదుపరి హస్త, వర్జ్యం ఉ.9.38 నుంచి 11.11 వరకు దుర్ముహూర్తం ప.11.20 నుంచి 12.06 వరకు అమృతఘడియలు... సా.6.44 నుంచి 8.14 వరకు.

సూర్యోదయం :    6.06
సూర్యాస్తమయం    :  5.22
రాహుకాలం :  ప. 12.00 నుంచి 1.30 వరకు
యమగండం :  ఉ.7.30 నుంచి 9.00 వరకు 

మేషం: ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో  చికాకులు. బంధువులతో అకారణ వైరం. ఆరోగ్యభంగం. వ్యాపారాలలో చికాకులు. ఉద్యోగులకు అదనపు పనిభారం. 

వృషభం: ఆదాయం అంతగా కనిపించదు. దూరప్రయాణాలు. స్వల్ప అనారోగ్యం. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు. దైవదర్శనాలు.

మిథునం: కొత్త పనులు ప్రారంభిస్తారు. అందరిలోనూ గౌరవం. విలువైన వస్తువులు సేకరిస్తారు. చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో ఉన్నత స్థితి. 

కర్కాటకం: రుణదాతల నుంచి ఒత్తిడులు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటిలో వివాదాలు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగులకు బదిలీ సూచనలు. 

సింహం: కొత్త వ్యక్తుల పరిచయం. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. ఆశించిన రాబడి కనిపిస్తుంది.  వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో శుభవార్తలు.  

కన్య: అనుకోని ప్రయాణాలు. ఆరోగ్యభంగం.  భూ వివాదాలు నెలకొంటాయి. రాబడి కొంత మందగిస్తుంది. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో ఉన్నతి.

తుల: కొత్త  పనులు   చేపడతారు. మిత్రులను కలుసుకుంటారు. కాంట్రాక్టులు కైవసం చేసుకుంటారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో  హోదాలు.

వృశ్చికం: ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు.  భూములు కొనుగోలు యత్నాలు  కలిసివస్తాయి. శుభవార్తలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో మంచి గుర్తింపు. 

ధనుస్సు: కుటుంబ సమస్యలు.  దూరప్రయాణాలు. స్నేహితులతో విభేదాలు. అనారోగ్యం. దైవదర్శనాలు.  వ్యాపారాలలో లాభాలు కష్టమే. ఉద్యోగాలలో మార్పులు.  

మకరం: కొన్ని పనుల్లో అవాంతరాలు. ఆస్తి విషయాలలో చికాకులు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలలో ఆటుపోట్లు. ఉద్యోగాలలో ఒత్తిడులు. 

కుంభం: నిరుద్యోగుల యత్నాలు ఫలిస్తాయి. మిత్రుల కలయిక.  వాహనాలు, ఆభరణాలు కొంటారు. వ్యాపార లావాదేవీలు ఊపందుకుంటాయి. ఉద్యోగులకు కొత్త ఆశలు. 

మీనం: ఉద్యోగయత్నాలలో విజయం. వస్తులాభాలు.  ప్రముఖులతో పరిచయాలు.  వ్యాపారాలలో ముందుకు సాగుతారు. ఉద్యోగాలలో ఉన్నత హోధాలు.

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top