గ్రహం అనుగ్రహం (11-08-2020)

Daily Horoscope in Telugu (11-08-2020) - Sakshi

శ్రీ శార్వరి నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు శ్రావణ మాసం, తిథి బ.సప్తమి ఉ.6.11 వరకు, తదుపరి అష్టమినక్షత్రం భరణి రా.11.04 వరకు, తదుపరి కృత్తిక, వర్జ్యం ఉ.7.10 నుంచి 8.56 వరకు, దుర్ముహూర్తం ఉ.8.16 నుంచి 9.06 వరకుతదుపరి రా.10.56 నుంచి 11.43 వరకు అమృతఘడియలు...సా.5.43 నుంచి 7.31 వరకు.

సూర్యోదయం :    5.45
సూర్యాస్తమయం    :  6.26
రాహుకాలం :  ప. 3.00 నుంచి 4.30 వరకు
యమగండం :  ఉ.9.00 నుంచి 10.30 వరకు 

గ్రహఫలం
మేషం....పనుల్లో కొంత జాప్యం. ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. శ్రమ తప్పదు. ఆకస్మిక ప్రయాణాలు. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలు సాదాసీదాగా ఉంటాయి.

వృషభం...ప్రముఖుల నుంచి శుభవార్తలు. ఆకస్మిక ధనలబ్ధి. నూతన పరిచయాలు. సంఘంలో ఆదరణ. సోదరులతో వివాదాలు తీరతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత ఉత్సాహవంతంగా ఉంటాయి.

మిథునం....సన్నిహితులతో కలహాలు. రుణాలు చేస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. కుటుంబంలో ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు.

కర్కాటకం...నూతనోత్సాహంతో పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయులతో ఆనందాన్ని పంచుకుంటారు. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత సంతృప్తినిస్తాయి.

సింహం....పనులు మధ్యలో విరమిస్తారు. ఒప్పందాలు వాయిదా వేస్తారు. అనుకోని ప్రయాణాలు. రుణాలు చేస్తారు. స్థిరాస్తి వివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఒత్తిళ్లు.

కన్య....ఇంటర్వ్యూలు అందుతాయి. నూతన ఒప్పందాలు. ఆర్థికాభివృద్ధి. ముఖ్య నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో మీ అంచనాలు నిజం కాగలవు.

తుల...ఉద్యోగయత్నాలు సానుకూలం. కొత్త పనులు చేపడతారు. ఆకస్మిక ధన, వస్తులాభాలు. చిన్ననాటి స్నేహితుల నుంచి కీలక సమాచారం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం.

వృశ్చికం....కొత్త రుణాలు చేస్తారు. ప్రయాణాలలో మార్పులు. అనారోగ్యం. శ్రమకు ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

ధనుస్సు...వ్యవహారాలలో అవాంతరాలు. ఆర్థిక ఇబ్బందులు. ఆరోగ్యభంగం. ఒప్పందాలు వాయిదా. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

మకరం....కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. వాహనయోగం. ముఖ్య నిర్ణయాలు. వ్యవహారాలలో అనుకూలత. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఆందోళన తొలగుతుంది.

కుంభం....సన్నిహితులతో సఖ్యత. ఇంటాబయటా అనుకూలత. కొత్త వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆస్తి వివాదాలు పరిష్కారం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు.

మీనం...సన్నిహితులతో వివాదాలు పరిష్కారం. శుభకార్యాల ప్రస్తావన. కుటుంబంలో ఒత్తిడులు తొలగుతాయి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మీదే పైచేయిగా ఉంటుంది.

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top