ఈ రాశివారికి ఉద్యోగాలలో పూర్వవైభవం

Daily Horoscope In Telugu 10 June 2021 - Sakshi

శ్రీ ప్లవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు వైశాఖ మాసం, అమావాస్య ప.3.10 వరకు, తదుపరి జ్యేష్ఠ  శు.పాడ్యమి, నక్షత్రం రోహిణి ఉ.11.11 వరకు, తదుపరి మృగశిర వర్జ్యం సా.5.10 నుండి 7.04 వరకు, దుర్ముహూర్తం ఉ.9.47 నుంచి 10.41 వరకు, తదుపరి ప.3.01 నుండి 3.53 వరకు అమృత ఘడియలు... ఉ.7.36 నుంచి 9.22 వరకు.

సూర్యోదయం :    5.28
సూర్యాస్తమయం    :  6.29
రాహుకాలం : ప.1.30 నుంచి 3.00 వరకు
యమగండం :  ఉ.6.00 నుంచి 7.30 వరకు

రాశి ఫలాలు
మేషం: ధనవ్యయం. కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు,ఉద్యోగాలలో మార్పులు ఉండవచ్చు. దైవదర్శనాలు.

వృషభం: ప్రముఖులతో పరిచయాలు. నిరుద్యోగుల ప్రయత్నాలు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త ఆశలు.

మిథునం: వ్యవహారాలు మందగిస్తాయి. ప్రయాణాలు వాయిదా. శ్రమాధిక్యం. బంధువులతో మాటపట్టింపులు. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.

కర్కాటకం: చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ప్రముఖుల నుంచి కీలక సమాచారం. ఉద్యోగయోగం. ముఖ్య నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.

సింహం: ఒక ప్రకటన ఆకట్టుకుంటుంది. సన్నిహితులతో చర్చలు. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు. ఆధ్యాత్మిక చింతన. వ్యవహారాలలో విజయం.
వ్యాపారాలు, ఉద్యోగాలలో పూర్వవైభవం.

కన్య: రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో స్వల్ప వివాదాలు. వ్యాపార లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాలలో మార్పులు

తుల: అనుకోని ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. ఆర్థిక పరిస్థితి కొంత మందగిస్తుంది. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.

వృశ్చికం: కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.

ధనుస్సు: ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో మరింత అనుకూలం. పాతమిత్రులను కలుసుకుని సంతోషంగా గడుపుతారు.

మకరం: వ్యయప్రయాసలు. పనులలో స్వల్ప ఆటంకాలు. ప్రయాణాలు వాయిదా. శ్రమాధిక్యం. బంధువులతో మాటపట్టింపులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు. 

కుంభం: శ్రమాధిక్యం. కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. బంధుమిత్రులతో వివాదాలు. ధనవ్యయం. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.
వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.

మీనం: ప్రముఖులతో పరిచయాలు. ఉద్యోగయోగం. భాగస్వామ్య వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో పనిభారం తగ్గుతుంది. పనులు చకచకా సాగుతాయి.

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top