ఈ రాశివారికి నేడు ఆకస్మిక ధనలాభం..

Daily Horoscope In Telugu (10-1-2021) - Sakshi

శ్రీ శార్వరి నామ సంవత్సరం దక్షిణాయనం, హేమంత ఋతువు మార్గశిర మాసం, తిథి బ.ద్వాదశి ప.3.47 వరకు, తదుపరి త్రయోదశి, నక్షత్రం అనూరాధ ఉ.10.11 వరకు, తదుపరి జ్యేష్ఠ వర్జ్యం ప.3.25 నుంచి 4.55 వరకు దుర్ముహూర్తం ప.4.11 నుంచి 4.53 వరకు అమృతఘడియలు... రా.12.22 నుంచి 1.54 వరకు.

సూర్యోదయం        :  6.37
సూర్యాస్తమయం    :  5.37
రాహుకాలం :  సా.4.30 నుంచి 6.00 వరకు
యమగండం :  ప.12.00 నుంచి 1.30 వరకు

మేషం: పనులలో ప్రతిష్ఠంభన. ఆకస్మిక ప్రయాణాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో ఒత్తిడులు. పుణ్యక్షేత్రాల సందర్శనం. వ్యాపారాలు, ఉద్యోగాలు సాధారణంగా ఉంటాయి.

వృషభం: కొత్త పనులకు శ్రీకారం. శుభవార్తా శ్రవణం. ఆర్థిక ప్రగతి. కొత్త వ్యక్తుల పరిచయం. వాహనాలు, ఆభరణాలు కొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి.

మిథునం: ఆహ్వానాలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. ధన,వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. ముఖ్య నిర్ణయాలు. స్థిరాస్తివృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.

కర్కాటకం: మిత్రులు, శ్రేయోభిలాషులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. శ్రమ తప్పదు. పనుల్లో ఆటంకాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశాజనకంగా ఉంటాయి.

సింహం: ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. వ్యయప్రయాసలు. బంధువులతో విభేదాలు. దూరప్రయాణాలు. సన్నిహితుల నుంచి ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.

కన్య: శుభవార్తలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. ధనలబ్ధి. ప్రముఖుల నుంచి కీలక సందేశం. ఆస్తిలాభం. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి. దైవదర్శనాలు.

తుల: కుటుంబంలో ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. పనుల్లో అవాంతరాలు. రుణయత్నాలు. ప్రయాణాలు వాయిదా. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు.

వృశ్చికం: యత్నకార్యసిద్ధి. పలుకుబడి పెరుగుతుంది. బంధువులను కలుసుకుంటారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఉద్యోగాలలో అనుకూలత.

ధనుస్సు: మిత్రుల నుంచి ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. కొన్ని వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు గందరగోళపరుస్తాయి.

మకరం: చేపట్టిన పనులలో విజయం. ఆప్తుల నుంచి ముఖ్య సమాచారం. స్థిరాస్తి లాభం. ఊహించని ఆహ్వానాలు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం.

కుంభం: విద్యార్థుల యత్నాలు సఫలం. పలుకుబడి పెరుగుతుంది. ఒక ప్రకటన ఆకట్టుకుంటుంది. దైవదర్శనాలు. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.

మీనం: మిత్రులతో కలహాలు. కొత్తరుణయత్నాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. కుటుంబంలో కొద్దిపాటి సమస్యలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత ప్రోత్సాహం.

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top