గ్రహం అనుగ్రహం (08-12-2020)

Daily Horoscope In Telugu (08-12-2020) - Sakshi

శ్రీ శార్వరి నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు కార్తీక మాసం, తిథి బ.అష్టమి ప.1.34 వరకు, తదుపరి నవమి నక్షత్రం పుబ్బ ఉ.11.01 వరకు, తదుపరి ఉత్తర, వర్జ్యం సా.5.51 నుంచి 7.20 వరకు, దుర్ముహూర్తం ఉ.8.35 నుంచి 9.17 వరకు తదుపరి రా.10.35 నుంచి 12.15 వరకు అమృతఘడియలు... రా.2.58 నుంచి 4.07 వరకు.

సూర్యోదయం :    6.22
సూర్యాస్తమయం    :  5.22
రాహుకాలం :  ప. 3.00 నుంచి 4.30 వరకు
యమగండం :  ఉ.9.00 నుంచి 10.30 వరకు

రాశిఫలం:
మేషం: వ్యవహారాలలో ఆటంకాలు. అనుకోని ఖర్చులు. ప్రయాణాలలో మార్పులు. వ్యయప్రయాసలు. వృత్తి, వ్యాపారాలలో చికాకులు. స్వల్ప ఆరోగ్య సమస్యలు.

వృషభం: రుణాలు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. బంధువిరోధాలు. ఆరోగ్యభంగం. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం. ఆకస్మిక ప్రయాణాలు.

మిథునం: కొత్త పనులు చేపడతారు. ఆత్మీయులు, బంధువులతో వివాదాలు సర్దుకుంటాయి. వస్తులాభాలు. ఇంటర్వ్యూలకు హాజరవుతారు. వృత్తి, వ్యాపారాలలో ప్రోత్సాహం.

కర్కాటకం: పనుల్లో అవాంతరాలు. వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. ధనవ్యయం. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు.

సింహం: కొత్త వ్యక్తుల పరిచయాలు. సంఘంలో గౌరవం. ఆస్తిలాభం. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. పలుకుబడి పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా ఉంటాయి.

కన్య: మిత్రులతో మాటపట్టింపులు. వృథా ఖర్చులు. దూరప్రయాణాలు. కుటుంబంలో చికాకులు. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలు గందరగోళంగా ఉంటాయి.

తుల: శ్రమ ఫలిస్తుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం. శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు హోదాలు. విద్యార్థులకు అనుకూలత.

వృశ్చికం: మిత్రులతో వివాదాలు తీరతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలలో పురోభివృద్ధి. కళాకారులకు శుభవార్తలు

ధనుస్సు: శ్రమాధిక్యం. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబ, ఆరోగ్య సమస్యలు. బం«ధువులతో వివాదాలు. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా ఉంటాయి.

మకరం:కుటుంబంలో చికాకులు. అనారోగ్యం. దైవదర్శనాలు.  బంధువులతో మాటపట్టింపులు. దూరప్రయాణాలు. వృత్తి, వ్యాపారాలలో ఒడిదుడుకులు.

కుంభం: పరిచయాలు పెరుగుతాయి. ఆస్తి వివాదాల పరిష్కారం. ధనలాభం. చిత్రమైన  సంఘటనలు. దూరప్రాంతాల నుంచి కీలక సమాచారం. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి.

మీనం: శుభకార్యాలకు హాజరవుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.  భూ, వాహనయోగాలు. కీలక నిర్ణయాలు. వృత్తి, వ్యాపారాలు సాఫీగా సాగుతాయి.

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top