ఈ రాశివారు ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు

Daily Horoscope In Telugu 07-08-2021 - Sakshi

శ్రీ ప్లవ నామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం, తిథి బ.చతుర్దశి సా.6.17 వరకు, తదుపరి అమావాస్య, నక్షత్రం పునర్వసు ఉ.8.24 వరకు, తదుపరి పుష్యమి, వర్జ్యం సా.4.50 నుండి 6.31 వరకు దుర్ముహూర్తం ఉ.5.43 నుండి 7.24 వరకు అమృతఘడియలు... రా.2.58 నుండి 4.40 వరకు.

సూర్యోదయం :    5.44
సూర్యాస్తమయం    :  6.28
రాహుకాలం :  ఉ.9.00 నుంచి 10.30 వరకు
యమగండం :  ప.1.30 నుంచి 3.00 వరకు 

మేషం: పనులు నిరాశ పరుస్తాయి. శ్రమాధిక్యం. బంధువులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

వృషభం: శ్రమ ఫలిస్తుంది. వ్యవహారాలలో విజయం. శుభవార్తలు వింటారు. భూములు, వాహనాలు కొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.

మిథునం: బంధువులతో తగాదాలు. పనుల్లో ఆటంకాలు. దూరప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

కర్కాటకం: సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. పనులు విజయవంతంగా సాగుతాయి. ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆటంకాలు తొలగుతాయి.

సింహం: శ్రమకు ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. పనులు మధ్యలో వాయిదా. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.

కన్య: దీర్ఘకాలిక సమస్యలు తీరతాయి. ఆప్తుల నుంచి కీలక సమాచారం. వస్తులాభాలు. ప్రముఖులతో పరిచయాలు. ఆకస్మిక ధనలాభం. వ్యాపారాలు, ఉద్యోగాలలో లక్ష్యాలు సాధిస్తారు.

తుల: కొత్త ఉద్యోగాన్వేషణ అనుకూలిస్తుంది. పరపతి పెరుగుతుంది. ఆహ్వానాలు అందుతాయి. వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి.

వృశ్చికం: పనులు మందగిస్తాయి. శ్రమాధిక్యం. మిత్రులతో విభేదాలు. అనారోగ్య సూచనలు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.

ధనుస్సు: బంధువులతో తగాదాలు. ఆర్థిక ఇబ్బందులు. పనులు ముందుకు సాగవు. ఆకస్మిక ప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.

మకరం: ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి.

కుంభం: పనులు సాఫీగా సాగుతాయి. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. బంధువులతో సత్సంబంధాలు. వాహనయోగం. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి.

మీనం: పరిస్థితులు అనుకూలించవు. వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. పనులు నిరాశ కలిగిస్తాయి. ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top