ఈ రాశివారికి ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి

Daily Horoscope In Telugu 06-08-2021 - Sakshi

శ్రీ ప్లవ నామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం, తిథి బ.త్రయోదశి సా.5.18 వరకు, తదుపరి చతుర్దశి, నక్షత్రం ఆరుద్ర ఉ.6.35 వరకు, తదుపరి పునర్వసు వర్జ్యం రా.7.28 నుండి 9.11 వరకు, దుర్ముహూర్తం ఉ.8.17 నుండి 9.06 వరకు, తదుపరి ప.12.30 నుండి 1.21 వరకు అమృతఘడియలు... ఉ.5.49 నుండి 7.31 వరకు.

సూర్యోదయం :    5.43
సూర్యాస్తమయం     :  6.29
రాహుకాలం : ఉ.10.30 నుంచి 12.00 వరకు
యమగండం :  ప.3.00 నుంచి 4.30 వరకు 

మేషం: కొత్త పనులు చేపడతారు. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. ఆప్తుల నుంచి పిలుపు. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో సానుకూలత.

వృషభం: పనుల్లో అవాంతరాలు. రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో మాటపట్టింపులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

మిథునం: పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. పరపతి పెరుగుతుంది. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.

కర్కాటకం: వ్యవహారాలలో జాప్యం. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ పరుస్తుంది. భూవివాదాల పరిష్కారం. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.

సింహం: అనుకున్న పనులు సజావుగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల ఆదరణ లభిస్తుంది. వస్తు, వస్త్రలాభాలు. ప్రముఖులతో పరిచయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో లక్ష్యాలు నెరవేరతాయి.

కన్య: ఇంటర్వ్యూలు రాగలవు. ఆస్తిలాభం. సోదరులతో విభేదాలు పరిష్కారం. శుభవార్తలు వింటారు. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని సమస్యలు పరిష్కారం.

తుల: పరిస్థితులు అంతగా కలిసిరావు. కుటుంబబాధ్యతలు పెరుగుతాయి. ఆలోచనలు నిలకడగా ఉండవు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో లేనిపోని వివాదాలు.

వృశ్చికం: రుణయత్నాలు సాగిస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. మిత్రులతో కలహాలు. శ్రమ పెరుగుతుంది. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత ఇబ్బందిగా మారవచ్చు.

ధనుస్సు: కొత్త వ్యక్తుల పరిచయం. సంఘంలో గౌరవం దక్కుతుంది. ఆస్తుల వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. వ్యాపారాలు విస్తరణ అనుకూలిస్తుంది. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి.

మకరం: సన్నిహితులతో వివాదాలను పరిష్కరించుకుంటారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం.

కుంభం: పనుల్లో అవాంతరాలు. రుణదాతల ఒత్తిడులు. ఆలయాల సందర్శనం. అనారోగ్యం. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆటుపోట్లు.

మీనం: శ్రమ పడ్డా ఫలితం ఉండదు. ఆస్తులు కొనుగోలులో ఆటంకాలు. పనులు వాయిదా వేస్తారు. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.
 

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top