గ్రహం అనుగ్రహం(05-10-2020)

Daily Horoscope In Telugu (05-10-2020) - Sakshi

గ్రహం అనుగ్రహం

శ్రీశార్వరినామ సంవత్సరం. దక్షిణాయనం, శరదృతువు. అధిక ఆశ్వయుజ మాసం. తిథి బ.తదియ ఉ.7.09 వరకు, తదుపరి చవితి. నక్షత్రం భరణి ప.1.20 వరకు, తదుపరి కృత్తిక. వర్జ్యం రా.2.29 నుంచి 4.15 వరకు. దుర్ముహూర్తం ప.12.12 నుంచి 1.01 వరకు, తదుపరి ప.ప.2.34 నుంచి 3.21 వరకు. అమృత ఘడియలు ఉ.8.01 నుంచి 9.45 వరకు.

సూర్యోదయం: 5.54 సూర్యాస్తమయం: 5.45 
రాహుకాలం :  ఉ.7.30 నుంచి  9.00 వరకు. 
యమగండం : ఉ.10.30 నుంచి 12.00 వరకు

రాశిఫలాలు:

మేషం: మిత్రులతో ఆనందంగా గడుపుతారు. విలువైన వస్తువులు సేకరిస్తారు. ఆకస్మిక ధనలాభం. బాధ్యతలు సమర్థంగా నిర్వహిస్తారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులు కోరుకున్న మార్పులు పొందుతారు.

వృషభం: దూరప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. బంధువులతో  స్వల్ప వివాదాలు. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. ఉద్యోగులకు ఒత్తిడులు.

మిథునం: కృషి ఫలిస్తుంది. పనుల్లో విజయం. శుభవార్తా శ్రవణం. పాతమిత్రుల నుంచి ఆహ్వానాలు. వాహనయోగం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు కొత్త హోదాలు. 

కర్కాటకం: పరపతి పెరుగుతుంది. సన్నిహితుల నుంచి ధనలాభం. ఉద్యోగయత్నాలు సానుకూలం. దైవదర్శనాలు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు విధుల్లో ప్రశంసలు. 

సింహం: వ్యూహాలలో పొరపాట్లు. ఆర్థిక ఇబ్బందులు. రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగస్తులు విధుల్లో అవాంతరాలు.

కన్య: ఆకస్మిక ప్రయాణాలు. రుణయత్నాలు. ఒప్పందాలలో ఆటంకాలు. పనులు మధ్యలో వాయిదా పడతాయి. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగులకు కొత్త చిక్కులు.

తుల: చిరకాల మిత్రులను కలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం. విలువైన వస్తువులు కొంటారు. భూవివాదాల పరిష్కారం. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.

వృశ్చికం: ప్రముఖుల నుంచి ముఖ్య సమాచారం. పనుల్లో మరింత పురోగతి. మిత్రుల నుంచి శుభవార్తలు.  వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు ఉన్నత హోదాలు.

ధనుస్సు: పనులు వాయిదా వేస్తారు. దూరప్రయాణాలు. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. వ్యాపారాలు కాస్త నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగులకు పనిభారం.
మకరం: మిత్రుల నుంచి ఒత్తిడులు. ఆకస్మిక ప్రయాణాలు. రుణాలు చేస్తారు. ఆలోచనలు కలసిరావు. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగులకు పనిభారం.

కుంభం: కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రముఖుల నుంచి ముఖ్య సమాచారం.  విద్యావకాశాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు.

మీనం: ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. ఆలయ దర్శనాలు. కుటుంబసభ్యులతో విభేదాలు.  వృత్తి, వ్యాపారాలు మందకొడిగా ఉంటాయి.
 

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top