ఈ రాశివారికి ఆశ్చర్యకరమైన సంఘటనలు జరుగుతాయి

Daily Horoscope In Telugu 04-08-2021 - Sakshi

శ్రీ ప్లవ నామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం, తిథి బ.ఏకాదశి ప.2.07 వరకు, తదుపరి ద్వాదశి, నక్షత్రం మృగశిర తె.4.19 వరకు (తెల్లవారితే గురువారం), తదుపరి ఆరుద్ర, వర్జ్యం ఉ.8.01 నుండి 9.45 వరకు, దుర్ముహూర్తం ప.11.40 నుండి 12.32 వరకు అమృతఘడియలు... రా.6.32 నుండి 8.20 వరకు. 

సూర్యోదయం :    5.42
సూర్యాస్తమయం    :  6.29
రాహుకాలం :  ప. 12.00 నుంచి 1.30 వరకు
యమగండం :  ఉ.7.30 నుంచి 9.00 వరకు 

మేషం:  పనులు హఠాత్తుగా వాయిదా వేస్తారు. శ్రమాధిక్యం. బంధువులతో తగాదాలు. అనారోగ్య సూచనలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అవాంతరాలు తొలగుతాయి.

వృషభం: బంధువులను కలుసుకుంటారు. ఆస్తుల వ్యవహారాలలో సమస్యలు తీరతాయి. వాహనయోగం. పనుల్లో విజయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో  ఉత్సాహవంతంగా ఉంటుంది.

మిథునం:  వ్యవహారాలు నిరాశాజనకంగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. వ్యయప్రయాసలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని చికాకులు.

కర్కాటకం: ఏ పని చేపట్టినా విజయవంతంగా పూర్తి. సంఘంలో గౌరవమర్యాదలు పెరుగుతాయి. ఆస్తి లాభం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఇంక్రిమెంట్లు రావచ్చు.

సింహం: సన్నిహితుల సాయం అందుతుంది. వ్యవహారాలలో పురోగతి. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు వీడతాయి.

కన్య: రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. ఆప్తులతో విభేదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో కొన్ని సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.

తుల:  ముఖ్య నిర్ణయాలు మార్చుకుంటారు. బంధుమిత్రులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత గందరగోళం.

వృశ్చికం:  పరిస్థితులు అనుకూలిస్తాయి. సమావేశాలలో పాల్గొంటారు. వాహనయోగం. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా సాగుతాయి.

ధనుస్సు: ఆర్థిక ప్రగతి సాధిస్తారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. పనుల్లో అవాంతరాలు తొలగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలమైన కాలం.

మకరం: సన్నిహితులతో అకారణ వైరం. చిన్ననాటి మిత్రుల కలయిక. ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. పనులు మందగిస్తాయి. ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త వివాదాలు.

కుంభం:  దూరప్రయాణాలు. ఆర్థిక ఇబ్బందులు. బంధుమిత్రుల నుంచి ఒత్తిడులు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. పనులు వాయిదా వేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

మీనం:  శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనలాభం. కార్యసిద్ధి. ప్రముఖులతో పరిచయాలు. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అంచనాలు నిజం కాగలవు.
 

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top