గ్రహం అనుగ్రహం (03-09-2020)

Daily Horoscope In Telugu (03-09-2020) - Sakshi

శ్రీ శార్వరినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువుభాద్రపద మాసం, తిథి బ.పాడ్యమి ఉ.10.40 వరకుతదుపరి విదియ, నక్షత్రం పూర్వాభాద్ర రా.8.19 వరకుతదుపరి ఉత్తరాభాద్ర, వర్జ్యం ..లేదు, దుర్ముహూర్తం ఉ.9.55 నుంచి 10.44 వరకు, తదుపరి ప.2.54 నుంచి 3.43 వరకుఅమృతఘడియలు...ఉ.11.40 నుంచి 1.23 వరకు

సూర్యోదయం :    5.49
సూర్యాస్తమయం    :  6.11
రాహుకాలం :  ప. 1.30 నుంచి 3.00 వరకు
యమగండం :  ఉ.6.00 నుంచి 7.30 వరకు

మేషం : మిత్రులతో ఆనందంగా గడుపుతారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది.

వృషభం : కుటుంబసభ్యుల సలహాలు స్వీకరిస్తారు. పనులు నిదానంగా సాగుతాయి. బంధువుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు. దైవదర్శనాలు. ఆరోగ్య సమస్యలు. 

మిథునం : పనులు నెమ్మదిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. వ్యయప్రయాసలు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి. ధనవ్యయం.

కర్కాటకం : పనుల్లో జాప్యం. ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. శ్రమాధిక్యం. అనారోగ్యం. ప్రయాణాల్లో ఆటంకాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు. ఆలయ దర్శనాలు.

సింహం : పరిచయాలు పెరుగుతాయి. కార్యజయం. ఆప్తుల నుంచి కీలక సమాచారం. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి. వాహన, గృహయోగాలు. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు.

కన్య : ఇంటాబయటా అనుకూలం. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం. శుభవార్తా శ్రవణం. మిత్రుల నుంచి ఆహ్వానాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు.

తుల : ముఖ్యమైన నిర్ణయాలలో మార్పులు. ధనవ్యయం. ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. ప్రయాణాలు వాయిదా. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిళ్లు. కళాకారుల యత్నాలు ముందుకు సాగవు.

వృశ్చికం : వ్యవహారాలలో అవరోధాలు. బంధువులతో విభేదాలు. శ్రమ తప్ప ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

ధనుస్సు : నూతన పరిచయాలు. కాంట్రాక్టులు లభిస్తాయి. జీవిత భాగస్వామి ద్వారా ఆస్తి, ధనలాభాలు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు. దైవదర్శనాలు.

మకరం : కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. ఆకస్మిక ప్రయాణాలు. రుణాలు చేస్తారు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.

కుంభం : వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. మిత్రుల నుంచి ముఖ్య విషయాలు తెలుస్తాయి. వస్తులాభాలు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త ఆశలు.

మీనం : పనులు చకచకా సాగుతాయి. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. మీ శ్రమ ఫలిస్తుంది. ఆస్తి వివాదాల పరిష్కారం. వ్యాపార విస్తరణలో ముందడుగు. ఉద్యోగులకు ఉన్నతహోదాలు.

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top