గ్రహం అనుగ్రహం(01-10-2020)

Daily Horoscope In Telugu (01-10-2020) - Sakshi

గ్రహం అనుగ్రహం

శ్రీ శార్వరి నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, అధిక ఆశ్వయుజ మాసం, తిథి పౌర్ణమి రా.1.15 వరకు, తదుపరి బ.పాడ్యమి నక్షత్రం ఉత్తరాభాద్ర తె.5.51 వరకు (తెల్లవారితే శుక్రవారం), తదుపరి రేవతి, వర్జ్యం ప.2.03 నుంచి 3.48 వరకు, దుర్ముహూర్తం ఉ.9.56 నుంచి 10.42 వరకు, తదుపరి ప.2.45 నుంచి 3.35 వరకు అమృతఘడియలు... రా.12.32 నుంచి 2.18 వరకు.

సూర్యోదయం :    5.54
సూర్యాస్తమయం    :  5.48
రాహుకాలం : ప.1.30 నుంచి 3.00 వరకు
యమగండం :  ఉ.6.00 నుంచి 7.30 వరకు

రాశిఫలం:
మేషం:ఆర్థిక వ్యవహారాలు నిరాశ పరుస్తాయి. శ్రమ తప్పదు. వ్యయప్రయాసలు. ఆరోగ్య సమస్యలు. చర్చల్లో ప్రతిష్ఠంభన. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.

వృషభం: కొత్త వ్యక్తులతో పరిచయాలు. సన్నిహితులతో మరింత సఖ్యత. వాహనయోగం. ముఖ్య నిర్ణయాలు. వ్యాపారాలు,  ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది..

మిథునం: కొత్త విషయాలు గ్రహిస్తారు. అప్రయత్న కార్యసిద్ధి. పరిచయాలు పెరుగుతాయి. పాతబాకీలు వసూలవుతాయి.  వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు ఎదుర్కొంటారు..

కర్కాటకం: వ్యవహారాలలో ఆటంకాలు. ప్రయాణాలు వాయిదా వేస్తారు.  కుటుంబంలో స్వల్ప చికాకులు. ఆలయాల  సందర్శనం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు. 

సింహం: కుటుంబసభ్యులతో విరోధాలు.  పట్టుదలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాలు ఉత్సాహాన్నిస్తాయి. ఆస్తి వివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఊహించని మార్పులు.

కన్య: కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఆత్మీయుల నుంచి శుభవర్తమానాలు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు,  ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు.

తుల: పనుల్లో కొంత అనుకూలత. వాహనాలు, భూములు కొంటారు. ఆర్థిక ప్రగతి. వస్తులాభాలు.  వ్యాపారాలు మరింత లాభిస్తాయి. ఉద్యోగాలలో పరిస్థితులు అనుకూలిస్తాయి.

వృశ్చికం: వ్యయప్రయాసలు. ముఖ్యమైన పనులు నిరుత్సాహపరుసర్శ్తాయి. దూరప్రయాణాలు. వ్యాపారాలు నిదానిస్తాయి. ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితి..

ధనుస్సు: ఆర్థిక విషయాలలో నిరుత్సాహం. పనులలో ఆటంకాలు. దైవదర్శనాలు.  నిర్ణయాలు వాయిదా. ప్రయాణాలు వాయిదా.  వ్యాపారాలలో చికాకులు.  ఉద్యోగాలలో పనిఒత్తిడులు. 

మకరం: చేపట్టిన పనులు పూర్తి.  అందరిలోనూ విశేష గౌరవం.  ప్రముఖులతో పరిచయాలు. శుభవర్తమానాలు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో శ్రమ తగ్గుతుంది.

కుంభం: కార్యక్రమాలలో అవాంతరాలు. దూరప్రయాణాలు. బంధువర్గంతో తగాదాలు. ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి.  ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు.. 

మీనం: పలుకుబడి పెరుగుతుంది. సన్నిహితులు సహకారం అందిస్తారు. భూ, గృహయోగాలు. నూతన ఉద్యోగాలు దక్కుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అంచనాలు నిజం చేసుకుంటారు.

 
 

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top