ఈ రాశివారికి కుటుంబంలో చికాకులు

Daily Horoscope In Telugu (01-04-2021) - Sakshi

శ్రీ శార్వరి నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు ఫాల్గుణ మాసం, తిథి బ.చవితి ప.3.55 వరకు, తదుపరి పంచమి నక్షత్రం విశాఖ ఉ.11.55 వరకు, తదుపరి అనూరాధ, వర్జ్యం ప.3.41 నుంచి 5.09 వరకు, దుర్ముహూర్తం ఉ.10.01 నుంచి 10.50 వరకు, తదుపరి ప.2.54 నుంచి 3.41 వరకు అమృతఘడియలు... రా.12.40 నుంచి 1.45 వరకు.

సూర్యోదయం :    5.59
సూర్యాస్తమయం    :  6.08
రాహుకాలం : ప.1.30 నుంచి 3.00 వరకు
యమగండం :  ఉ.6.00 నుంచి 7.30 వరకు 

దినఫలాలు:
మేషం... దూరపు బంధువుల కలయిక. విందువినోదాలు. వివాహ, ఉద్యోగయత్నాలు సానుకూలం. సభలు,సమావేశాలలో పాల్గొంటారు. వ్యాపార, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా ఉంటాయి.

వృషభం... ఉత్సాహంగా గడుపుతారు. వ్యవహారాలలో విజయం. పాతమిత్రుల కలయిక. ఆస్తుల వివాదాల పరిష్కారం.  వస్తులాభాలు. వ్యాపార, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.

మిథునం... కొన్ని పనులు మధ్యలో విరమిస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటిలో సమస్యలు చికాకు పరుస్తాయి. ఆరోగ్యభంగం. వృత్తి, వ్యాపారాలలో నిరుత్సాహం.

కర్కాటకం... శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. బంధువులతో తగాదాలు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.

సింహం... శుభవార్తలు అందుతాయి. కార్యజయం. కొన్ని సంస్థల్లో సభ్యత్వాలు స్వీకరిస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు ఉన్నత హోదాలు.

కన్య... రాబడి కన్నా ఖర్చులు పెరుగుతాయి. బంధువులతో విరోధాలు. ఆలోచనలు కలసిరావు. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో కొన్ని అవాంతరాలు.

తుల... అనుకున్న కార్యాలు దిగ్విజయంగా సాగుతాయి. విలువైన వస్తువులు సేకరిస్తారు. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపార లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు.

వృశ్చికం... కుటుంబంలో చికాకులు. అనుకోని ప్రయాణాలు. కుటుంబంలో ఒత్తిడులు. అనారోగ్యం. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలలో ఇబ్బందులు.

ధనుస్సు... దూరప్రాంతాల నుంచి కీలక సమాచారం. విందువినోదాలు. పనులు సకాలంలో పూర్తి కాగలవు. దైవదర్శనాలు. వృత్తి,వ్యాపారాలలో కొత్త ఆశలు.

మకరం... ఉద్యోగయత్నాలు సానుకూలం. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. ఆస్తిలాభం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు హోదాలు దక్కుతాయి.

కుంభం... వ్యయప్రయాసలు. మిత్రులు, శ్రేయోభిలాషుల నుంచి ఒత్తిడులు. రాబడికి మించి ఖర్చులు. ఆరోగ్యసమస్యలు. వ్యాపార, ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితి.

మీనం... రుణదాతల ఒత్తిడులు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో సమస్యలు. అనారోగ్యం. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి.

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top