శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, తిథి: బ.ద్వాదశి సా.5.37 వరకు తదుపరి త్రయోదశి, నక్షత్రం: ఆశ్లేష ఉ.5.59 వరకు, తదుపరి మఖ, వర్జ్యం: సా.6.54 నుండి 8.34 వరకు, దుర్ముహూర్తం: సా.4.16 నుండి 5.04 వరకు, అమృతఘడియలు: తె.5.08 నుండి ఉ.6.51 వరకు (తెల్లవారితే సోమవారం).
మేషం...
ముఖ్యమైన కార్యక్రమాల్లో ఆటంకాలు. ధనవ్యయం. కుటుంబసభ్యులతో వివాదాలు నెలకొంటాయి. నిరుద్యోగుల యత్నాలు అనుకూలించవు. దైవదర్శనాలు. వృత్తి,వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి.
వృషభం...
పనులు మధ్యలోనే విరమిస్తారు. పరిస్థితులు అంతగా అనుకూలించవు. ఆకస్మిక ప్రయాణాలు. సోదరులు, మిత్రులతో కలహాలు. వృత్తి, వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి.
మిథునం...
కొత్త వ్యక్తులతో పరిచయాలు. ఆకస్మిక ధనలబ్ధి. వ్యవహారాలలో విజయం. బంధువుల నుంచి శుభవార్తలు. స్థిరాస్తి వివాదాల పరిష్కారం. వృత్తి,వ్యాపారాలలో అనుకూలంగా ఉంటుంది.
కర్కాటకం...
రావలసిన సొమ్ము అందక ఇబ్బందులు. బంధుగణంతో వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో చికాకులు. అనారోగ్య సూచనలు.
సింహం...
ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. చిరకాల సమస్య నుంచి విముక్తి. వాహనసౌఖ్యం. వృత్తి,వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగ ప్రయత్నాలు సఫలం.
కన్య...
మిత్రులే శత్రువులుగా మారతాయి. ఆలోచనలు నిలకడగా ఉండవు. పనుల్లో ప్రతిబంధకాలు. శ్రమకు తగిన ఫలితం ఉండదు. అనారోగ్యం. భూవివాదాలు. వృత్తి,వ్యాపారాలలో ఒడిదుడుకులు.
తుల...
నూతన ఉద్యోగయోగం. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి కాగలవు. మీ కృషి ఫలించే సమయం. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉద్యోగాలలో అనుకున్న ప్రగతి కనిపిస్తుంది. వస్తులాభాలు.
వృశ్చికం...
పనులలో ఆటంకాలు తొలగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. నూతన ఉద్యోగప్రాప్తి. సంఘంలో గౌరవం. వృత్తి, వ్యాపారాలలో పురోగతి. వాహనాలు, గృహం కొనుగోలు చేస్తారు.
ధనుస్సు...
కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. వృథా ఖర్చులు. పుణ్యక్షేత్రాల సందర్శనం. ఆరోగ్యసమస్యలు. ఉద్యోగయత్నాలలో ఆటంకాలు. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.
మకరం...
వ్యవహారాలలో ఆటంకాలు. దూరప్రయాణాలు. అగ్రిమెంట్లు వాయిదా. శ్రమ తప్పదు. సోదరులు, మిత్రులతో అకారణ వైరం. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిళ్లు..
కుంభం...
ఆసక్తి్తకరమైన విషయాలు తెలుసుకుంటారు. విందువినోదాలు. పనులు చకచకా పూర్తి చేస్తారు. ఆర్థిక ప్రగతి. ఉద్యోగలాభం. వాహనయోగం. వృత్తి,వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.
మీనం...
ఓర్పుతో పనులు చక్కదిద్దుతారు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకం.. సన్నిహితులతో వివాదాలు తీరతాయి. వాహనయోగం. శుభకార్యాలలో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలలో ముందడుగు వేస్తారు.
ఇవి చదవండి: Weekly Horoscope: ఇంతకాలం వేధించిన సమస్యలు కొన్ని.. మిమ్మల్ని..
Comments
Please login to add a commentAdd a comment