రామయ్య ఖ్యాతిని నలుదిశలా వ్యాప్తిచేయాలి
ఒంటిమిట్ట: ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి ఖ్యాతిని నలుదిశలా వ్యాప్తి చెందేలా చేయాలని వైఎస్సార్‌సీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి అన్నారు. శనివారం ఆకేపాడు నుంచి ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయం వరకు మహా పాదయాత్రను ఆయన విజయవంతంగా పూర్తి చేశారు. పలువురు ప్రజా ప్రతినిధులు, వైఎస్సార్‌సీపీ నేతలు సంఘీభావం తెలిపారు. అందులో రాష్ట్ర మహిళా అధికార ప్రతినిధి శ్యామల, జెడ్పీ చైర్మన్ గోవిందరెడ్డి, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషా , కోడూరు మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు, కడప నగర మాజీ మేయర్ సురేష్ బాబు, కడప డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి, వైఎస్సార్‌సీపీ రాజంపేట ఇన్‌చార్జి ఆకేపాటి అనిల్ కుమార్ వైఎస్సార్‌సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు సంబటూరు ప్రసాద్‌రెడ్డి తదితరులు ఉన్నారు.పాదయాత్ర ఒంటిమిట్టకు చేరుకోగానే ముందుగా ఆకేపాటి, ఆయన కుటుంబ సభ్యులు స్వామి వారికి తలలీలాలు సమర్పించారు.గర్భాలయంలోని మూలవిరాట్‌కు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజ పూర్తయిన తర్వాత గోవింద దీక్షను విరమించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆకేపాటి మాట్లాడుతూ ప్రతి ఏటా అన్నమయ్య కాలిబాటలో వేలాది మంది భక్తులతో వెళ్లి తిరుమల శ్రీవారిని దర్శించుకునే వాడినన్నారు. కానీ చంద్రబాబు ప్రభుత్వం అన్నమయ్య కాలిబాటలో వెళ్లరాదని నోటీసులు జారీ చేసిందన్నారు. తాను వెళ్లదలచుకుంటే ఎవరెన్ని ఆంక్షలు విధించినా వెళ్లే వాడినని, కానీ అలా చేయకూడదనే ఉద్దేశంతో తిరుమల పాదయాత్ర విరమించుకున్నానని తెలిపారు. తాను అధికారంలోకి వస్తే అ న్నమయ్య కాలిబాటను అభివృద్ధి చేస్తానని చెప్పిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఈ విషయం గురించి ఎందుకు పట్టించుకోలేదని ఆకేపాటి ప్రశ్నించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కా ర్యదర్శి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి, ఒంటిమిట్ట మండల అధ్యక్షుడు టక్కోలు శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఆకేపాటి పాదయాత్రకు సంఘీభావం తెలుపుతున్న మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషా, ఆకేపాటికి స్వాగతం పలుకుతున్న అభిమానులు, పక్కన మాజీ ఎమ్మెల్యే కొరముట్ల
రాజంపేట ఎమ్మెల్యే
ఆకేపాటి అమరనాథరెడ్డి
రామయ్య ఖ్యాతిని నలుదిశలా వ్యాప్తిచేయాలి
రామయ్య ఖ్యాతిని నలుదిశలా వ్యాప్తిచేయాలి


