శ్రీ సౌమ్యనాథ సేవా ట్రస్టుకు విరాళం | - | Sakshi
Sakshi News home page

శ్రీ సౌమ్యనాథ సేవా ట్రస్టుకు విరాళం

Dec 7 2025 8:33 AM | Updated on Dec 7 2025 8:33 AM

శ్రీ

శ్రీ సౌమ్యనాథ సేవా ట్రస్టుకు విరాళం

శ్రీ సౌమ్యనాథ సేవా ట్రస్టుకు విరాళం ఓపెన్‌ స్కూల్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల నృసింహ స్వామిని దర్శించుకున్న హైకోర్టు జడ్జి పోటీతత్వంతోనే ప్రతిభకు గుర్తింపు

నందలూరు: శ్రీ సౌమ్యనాథ స్వామి ఆలయం వద్ద ఉన్న శ్రీ సౌమ్యనాధ సేవా ట్రస్ట్‌ శాశ్వత అన్నదాన పథకానికి యద్దల వెంకట నోక్షిత్‌ పేరు పై యద్దల విజయభాస్కర్‌ కుమారుడు యద్దల శాంతిస్వరూప్‌, కోడలు షర్మిల రూ.75 వేలు విరాళం ఇచ్చారు. అన్నదాన సేవా ట్రస్ట్‌ కోశాధికారి చక్రాల రామసుబ్బన్నకు శనివారం చెక్కు అందజేశారు. కార్యక్రమంలో సౌమ్యనాధ సేవ ట్రస్ట్‌ ఛైర్మన్‌ యద్దల సుబ్బరాయుడు, ట్రస్టు సభ్యులు పల్లె సుబ్రమణ్యం, చక్రాల సాయినాథ్‌, వంశీకృష్ణ, పెంచలయ్య, వరదయ్య తదితరులు పాల్గొన్నారు.

రాయచోటి జగదాంబసెంటర్‌: ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక విద్యా పీఠం (ఓపెన్‌ స్కూల్‌) ద్వారా నిర్వహించే పది, ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్‌ను ఆ విద్యాపీఠం డైరెక్ట్‌ ఆర్‌.నరసింహారావు విడుదల చేశారు. పరీక్ష ఫీజుల షెడ్యూల్‌ను గత నెలలోనే విడుదల చేయగా, పరీక్ష ఫీజును అపరాధ రుసుం లేకుండా ఈ నెల 10వ తేదీలోగా చెల్లించాలి. ఈ నెల 11, 12వ తేదీల్లో సబ్జెక్టుకు రూ.25 అపరాధ రుసుముతో చెల్లించవచ్చు. ఈ నెల 13 నుంచి 15వ తేదీ వరకు సబ్జెక్టుకు రూ.50 అపరాధ రుసుంతో చెల్లించడానికి అవకాశం ఉంది. రెగ్యులర్‌ పదో తరగతి, ఇంటర్‌ విద్యార్థులతో పాటు ఓపెన్‌ స్కూల్‌ విద్యార్థులకు కూడా అదే సమయంలో పరీక్షలు నిర్వహిస్తారు. పదో తరగతి విద్యార్థులకు మార్చి 16 నుంచి 28 వరకు, ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరగనున్నాయి.. ఇంటర్‌ పరీక్షలు మార్చి 2 నుంచి 13వ తేదీల వరకు జరుపుతారు. పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటాయి.

రాజంపేట టౌన్‌: మండలంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ భువనగిరి లక్ష్మీనృసింహ స్వామిని శనివారం ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తి కె.శ్రీనివాసులురెడ్డి దంపతులు దర్శించుకున్నారు. ఈసందర్భంగా ఆలయ ధర్మకర్తలు, పురోహితులు శ్రీనివాసులురెడ్డి దంపతులకు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం వారు స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ చరిత్ర, విశిష్టత గురించి పురోహితులు న్యాయమూర్తికి తెలియజేశారు. కార్యక్రమంలో రాజంపేట జిల్లా జడ్జి ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌, కడప జిల్లా జడ్జి యామిని, రాజంపేట సీనియర్‌ సివిల్‌ జడ్జి కేశవరావు, జూనియర్‌ సివిల్‌జడ్జి పి.రాజన్‌ ఉదయ్‌ ప్రకాష్‌, సబ్‌కలెక్టర్‌ భావన, తహశీల్దార్‌ పీరుమున్ని ఉన్నారు.

రాయచోటి జగదాంబసెంటర్‌: విద్యార్థులు ఇతరులతో పోటీపడి చదివినప్పుడే వారి ప్రతిభకు గుర్తింపు లభిస్తుందని డైట్‌ ఇన్‌చార్జి ప్రిన్సిపల్‌ ఎం.నరసింహారెడ్డి అన్నారు. రాయచోటి పట్టణంలోని జడ్పీ బాలికల హైస్కూల్‌లో శనివారం కౌశల్‌ జిల్లా స్థాయి విజేతల బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమం జిల్లా కోఆర్డినేటర్‌ మధుమతి నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన నరసింహారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులలో ప్రశ్నించేతత్వం పెంపొందింనపుడే శాసీ్త్రయ దృక్పథం అలవడుతుందన్నారు. అనంతరం విజేతలకు మొదటి బహుమతి రూ.1500, ద్వితీయ బహుమతి వెయ్యి రూపాయల నగదుతో పాటు మెమొంటో, ప్రశంసాపత్రాలను ప్రదానం చేశారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యా యురాలు సైరాబాను, జిల్లా సైన్స్‌ అధికారి మార్ల ఓబుల్‌ఎడ్డి, సీడీఓ సుమతి, ఉపాధ్యాయ సంఘ నాయకులు హరిబాబు, కౌశల్‌ అసిస్టెంట్‌ కోఆర్డినేటర్‌ వెంకటరమణ, గైడ్‌ టీచర్లు ఆంజనేయులు, నిర్మల, రెడ్డయ్య, శాంతి, విద్యార్థులు పాల్గొన్నారు.

శ్రీ సౌమ్యనాథ  సేవా ట్రస్టుకు విరాళం 1
1/2

శ్రీ సౌమ్యనాథ సేవా ట్రస్టుకు విరాళం

శ్రీ సౌమ్యనాథ  సేవా ట్రస్టుకు విరాళం 2
2/2

శ్రీ సౌమ్యనాథ సేవా ట్రస్టుకు విరాళం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement