ఎంఎస్‌పీతో కొనుగోలు చేయాలి: ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి | - | Sakshi
Sakshi News home page

ఎంఎస్‌పీతో కొనుగోలు చేయాలి: ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి

Dec 7 2025 8:33 AM | Updated on Dec 7 2025 8:33 AM

ఎంఎస్

ఎంఎస్‌పీతో కొనుగోలు చేయాలి: ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి

కూలీ ఖర్చులు కూడా రావన్న ఉద్దేశంతో రైతులు ఉల్లి పంటను పొలాల్లోనే వదిలేశారని ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పరిహారం ఇంతవరకు అందలేదని విమర్శించారు. ఇటీవల మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రైతుల సమస్యలు తెలుసుకునేందుకు పర్యటించగా, సమస్యలు బోగస్‌ అంటూ జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి మాట్లాడటం దారుణమని మండిపడ్డారు. కేపీ ఉల్లికే కాకుండా ఖరీఫ్‌లో సాగు చేసిన మిగతా రకాల ఉల్లికి కూడా హెక్టారుకు రూ.50 వేలు పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. కనీస మద్దతు ధరను కల్పించి ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. రాజోలు రిజర్వాయర్‌ కింద 4 వేల ఎకరాల రైతుల భూములకు అవార్డు పాస్‌ చేశారని పేర్కొన్నారు. దీంతో పొలాలు అమ్ముకోలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. ఒకవేళ రిజర్వాయర్‌ నిర్మించకపోతే వెంటనే ఆ భూములను డీనోటిఫై చేయాలన్నారు.

గిట్టుబాటు ధరలు కల్పించాలి: ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి

జిల్లా రైతులు సాగు చేస్తున్న ఉల్లి, మినుము, శనగ, అరటి పంటలకు ప్రభుత్వం తక్షణమే గిట్టుబాటు ధరలు ప్రకటించి ఆదుకోవాలని ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డి కోరారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని గిట్టుబాటు ధరలతో ఆదుకోవాలన్నారు. ఈ మేరకు తీర్మానం ఆమోదించాలని సూచించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. పాఠశాలల్లో అసంపూర్తిగా ఉన్న చిన్నచిన్న పనులను పూర్తి చేసేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.

ఎంఎస్‌పీతో కొనుగోలు చేయాలి: ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి 
1
1/1

ఎంఎస్‌పీతో కొనుగోలు చేయాలి: ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement