చదును చేసింది నాలుగు ఎకరాలేనట ! | - | Sakshi
Sakshi News home page

చదును చేసింది నాలుగు ఎకరాలేనట !

Dec 7 2025 8:33 AM | Updated on Dec 7 2025 8:33 AM

చదును

చదును చేసింది నాలుగు ఎకరాలేనట !

నల్లగుట్టకు ఇరువైపులా

20 ఎకరాలకు పైగా చదును

ల్యాండ్‌ ప్యూరిఫికేషన్‌లో

చదును చేసిన భూమికి

హక్కులు సాధించేందుకు ఎత్తుగడ

కంటి తుడుపు చర్యలతో సరిపెట్టిన రెవెన్యూ అధికారులు

నిమ్మనపల్లె : అధికారం అండగా భూ కబ్జాకు పాల్పడుతూ ప్రభుత్వ భూమిని ఆక్రమించుకునేందుకు టీడీపీ నాయకులు నిమ్మనపల్లె మండలం, అయ్యవారిపల్లె గ్రామ సమీపంలోని నల్లగుట్ట ఇరువైపులా చదును చేశారు. ఈ వ్యవహారంలో రెవెన్యూ అధికారుల తీరు ఆశ్చర్యానికి గురి చేయడంతో పాటు విస్మయం కలిగిస్తోంది. వారం రోజులుగా నల్లగుట్టపై టీడీపీ నాయకులకు చెందిన మూడు నుంచి నాలుగు జేసీబీ యంత్రాలు పనిచేసి సుమారు 20 ఎకరాలకు పైగా గుట్టను చదును చేశారు. ఈ వ్యవహారాన్ని గమనించిన స్థానికులు గురువారం రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. సంఘటన స్థలానికి వెళ్లిన రెవెన్యూ అధికారులు అక్కడ పనిచేస్తున్న రెండు జేసీబీలను స్వాధీనం చేసుకున్నారు. వాటిని స్టేషన్‌కు తరలించి కేసులు నమోదు చేయించకపోగా, అధికార పార్టీ నాయకుల ఒత్తిడితో అధికారులకు అవసరమైన హెచ్చరిక బోర్డులు తయారు చేసి ఇచ్చేలా ఒప్పందం చేసుకుని వదిలేశారు. శుక్రవారం సాయంత్రం రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ రమేష్‌ వీఆర్‌ఓ నాగరాజా, వీఆర్‌ఏ సంఘటన స్థలానికి వెళ్లి, నల్లగుట్టపై హెచ్చరిక బోర్డు నాటారు. సర్వే నంబర్‌ 1037లోని 88.72 ఎకరాల భూమి ప్రభుత్వానికి చెందినదని, ఆక్రమణలకు పాల్పడితే చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరిక బోర్డు ప్రదర్శించారు. నాలుగు ఎకరాల ప్రభుత్వ భూమి చదును చేశారంటూ నిర్ధారించి, అందులో రెవెన్యూ అధికారులు బోర్డులు నాటినట్లుగా మీడియాకు తెలిపారు. అయితే నల్లగుట్టపై దాదాపు 15–20 ఎకరాల మేర భూమి చదును చేసినట్లు స్థానికులు చెబుతూ, అధికారులు చెబుతున్న నాలుగెకరాల లెక్కకు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ విస్మయం చెందుతున్నారు. అంతేకాకుండా గుట్టకు మరోవైపులా అయ్యవారిపల్లి గ్రామ సమీపంలో దాదాపుగా 5 ఎకరాల మేర భూమి చదును చేశారు. అయితే ఇందులో ఎలాంటి హెచ్చరిక బోర్డులు నాటలేదు. నల్లగుట్టలో ప్రభుత్వ భూమి ఆక్రమణపై సాక్షి పత్రికలో శ్రీఅధికారం అండగా భూకబ్జా శ్రీ శీర్షికన కథనం ప్రచురితం కావడంతో, ఉన్నతాధికారుల ఆదేశాలతో నిమ్మనపల్లె రెవెన్యూ అధికారులు హడావిడి చర్యలు మొదలుపెట్టారు. అయితే ఇందులోనూ అధికార పార్టీ నేతల ఒత్తిడితో, నాయకుడి మాటలు నమ్మిన గ్రామస్థాయి టీడీపీకి చెందిన రెడ్డివారి పల్లె పంచాయతీ బాలేవాండ్లపల్లెకు చెందిన నలుగురు మహిళలు, పల్లెకు చెందిన ఓ గ్రామస్థాయి నాయకుడిపై బైండోవర్‌ కేసులు పెట్టాలంటూ తహసీల్దార్‌ తపస్విని నిమ్మనపల్లె పోలీసులను ఆదేశించారు. ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించే వారిపై బైండోవర్‌ కేసులు నమోదు చేయించిన తహసీల్దార్‌, వారం రోజులు సంఘటన స్థలంలో చదును చేసిన జేసీబీ యజమానులు, ప్రభుత్వ భూమిని ఆక్రమించుకునేందుకు సహకారం అందించి పట్టాలిప్పిస్తానన్న టీడీపీ నాయకుడు, ఆక్రమణలకు పాల్పడిన మరికొందరిపై కనీస చర్యలు సైతం తీసుకోలేదు.

ప్రస్తుతం రెడ్డివారిపల్లె రెవిన్యూ గ్రామ పరిధిలో ల్యాండ్‌ ప్యూరిఫికేషన్‌ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ క్రమంలో ప్రభుత్వ భూమి చదును చేసి తమ స్వాధీనంలో ఉన్నట్టుగా చూపించి, ల్యాండ్‌ ప్యూరిఫికేషన్‌లో హక్కులు సాధించేందుకు టీడీపీ నాయకుడు ఎత్తుగడ వేశాడు. సదరు ప్రభుత్వ భూమికి పట్టాలు ఇప్పించి లబ్ధిదారుల నుంచి భారీగా దండుకొనే ప్రయత్నంలో భాగంగా నల్లగుట్టను చదును చేసినట్లు తెలుస్తోంది. ఆ మేరకు రెవెన్యూ అధికారులతో లోపాయికారిగా సర్దుబాటు చేసుకున్నట్లు స్థానికులు అంటున్నారు.

గుట్ట చదునులో ఐదుగురు బైండోవర్‌..

రెడ్డివారిపల్లి పంచాయతీ, అయ్యవారిపల్లి సమీపంలోని నల్లగుట్టలో ప్రభుత్వ భూమిని చదును చేసినందుకుగాను ఐదుగురు వ్యక్తులను బైండోవర్‌ చేసినట్లు నిమ్మనపల్లె పోలీసులు తెలిపారు. పిట్టావాండ్లపల్లెకు చెందిన వెంకటరమణ, బాలేవాండ్లపల్లెకు చెందిన నాగప్ప భార్య బాలే శ్యామలమ్మ, నారాయణ భార్య బాలే రేణుక, గంగప్ప భార్య బాలే సరోజ, బాలే మంగమ్మలపై, తహసీల్దార్‌ తపస్విని ఆదేశాలతో, వారు అక్రమంగా ప్రభుత్వ భూమిలోకి ప్రవేశించి చదును చేసి ఆక్రమించేందుకు ప్రయత్నించినందుకు గాను బైండోవర్‌ కేసులు పెట్టినట్లు తెలిపారు. మరోసారి ఇలాంటి చర్యలకు పాల్పడితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించినట్లు తెలిపారు.

వెలమ బోడి గుట్ట వద్ద చదును చేసిన ప్రభుత్వ భూమి నల్లగుట్టపై హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేసిన రెవెన్యూ అధికారులు

చదును చేసింది నాలుగు ఎకరాలేనట !1
1/1

చదును చేసింది నాలుగు ఎకరాలేనట !

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement