శాంతి, సౌభ్రాతృత్వానికి సరికొత్త అధ్యాయం | - | Sakshi
Sakshi News home page

శాంతి, సౌభ్రాతృత్వానికి సరికొత్త అధ్యాయం

Dec 7 2025 8:33 AM | Updated on Dec 7 2025 8:33 AM

శాంతి

శాంతి, సౌభ్రాతృత్వానికి సరికొత్త అధ్యాయం

హిందూ, ముస్లింల ఐక్యత చరిత్రలో నిలిచిపోతుంది

జిల్లా ఎస్పీ ధీరజ్‌ కునుబిల్లి

రాయచోటి : రాయచోటిలో శుక్రవారం రాత్రి జరిగిన అయ్యప్ప స్వాముల గ్రామోత్సవం చరిత్రలో నిలిచిపోతుందని జిల్లా ఎస్పీ ధీరజ్‌ కునుబిల్లి పేర్కొన్నారు. చిన్న అవాంఛనీయ సంఘటనకు కూడా తావు లేకుండా ఆదర్శవంతమైన శాంతియుత వాతావరణంలో అపూర్వ విజయం సాధించిందని శనివారం మీడియా సమావేశంలో ఎస్పీ అన్నారు. ఆధ్యాత్మిక శోభాయాత్రలో దాదాపు 1500 నుంచి 2000 మంది అయ్యప్ప స్వాములతోపాటు 3200 మందికి పైగా పాల్గొన్న భక్తులతో పట్టణమంతా భక్తి భావంతో పులకించిపోయిందన్నారు. గత అనుభవాల దృష్ట్యా ఈ గ్రామోత్సవాన్ని పోలీసులంతా ఒక సవాలుగా స్వీకరించి అత్యంత ప్రతిష్టాత్మకంగా భద్రతా ఏర్పాట్లను చేపట్టారన్నారు. ఈ గ్రామోత్సవంలో అత్యంత హైలైట్‌ హిందూ–ముస్లింల మధ్య వెల్లివిరిసిన అద్భుతమైన ఐక్యతను ఎస్పీ ప్రశంసించారు. ఊరేగింపు మార్గంలో ముస్లిం సోదరులు స్వచ్ఛందంగా స్వాగత వేదికలను ఏర్పాటు చేసి అయ్యప్ప స్వాములకు మంచినీరు, పండ్లరసాలు, అరటిపండ్లను పంపిణీ చేసి తమ గౌరవాన్ని, ఔన్నత్యాన్ని చాటుకున్నారన్నారు. ఇరువర్గాల మత పెద్దలు, యువకులు పరస్పరం గౌరవించుకుంటూ మత సామరస్యాన్ని మాటల్లో కాకుండా చేతల్లో చూపించి ఆదర్శంగా నిలిచారన్నారు. ప్రశాంత వాతావరణాన్ని కాపాడి ఐక్యత భావాన్ని ప్రదర్శించిన రాయచోటి ప్రజలు అయ్యప్ప స్వాములు, ముస్లిం మత పెద్దలు, యువకులు, భక్తులకు జిల్లా ఎస్పీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

యువకుడిపై మచ్చుకత్తితో దాడి

లక్కిరెడ్డిపల్లి : మండలంలోని గద్దగుండ్ల రాచపల్లికి చెందిన గంగరాజు అనే యువకుడిపై లక్కిరెడ్డిపల్లి టౌన్‌, పాత కోర్టు వద్ద నివాసం ఉన్న సురేష్‌ అనే వ్యక్తి శనివారం మచ్చు కత్తితో దాడి చేశాడు. ఎస్‌ఐ రవీంద్రబాబు కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. గంగరాజు తన మేనకోడలిని, పిల్లలను వదిలేందుకు అంగన్‌ వాడీ కేంద్రానికి వెళ్లాడు. అంగన్‌ వాడీ కేంద్రం పక్క ఇంటిలో సురేష్‌ అద్దెకు ఉంటున్నాడు. సురేష్‌ గంగరాజును సెల్‌ఫోన్‌ అడగగా తాను ఇవ్వనని గంగరాజు అన్నాడు. దీంతో ఒక్కసారిగా సురేష్‌ మచ్చుకత్తితో గంగరాజుపై దాడిచేయగా ఎడమచేతికి తీవ్ర గాయమైంది. తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే అనుమానంతో గంగరాజుపై మచ్చుకత్తితో దాడి చేశాడని తెలిపారు. స్థానికులు హుటాహుటిన స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్సకోసం కడప రిమ్స్‌కు, తిరిగి అక్కడినుంచి తిరుపతికి తీసుకెళ్లినట్లు ఎస్‌ఐ రవీంద్రబాబు తెలిపారు. ఈ మేరకు సురేష్‌పై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

శాంతి, సౌభ్రాతృత్వానికి  సరికొత్త అధ్యాయం   1
1/1

శాంతి, సౌభ్రాతృత్వానికి సరికొత్త అధ్యాయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement