ఆర్టీసీ బస్సులో నుంచి పడి మహిళకు గాయాలు
మదనపల్లె రూరల్ : ఆర్టీసీ బస్సులో నుంచి పడి మహిళ గాయపడిన ఘటన శనివారం ములకలచెరువు మండలంలో జరిగింది. చండ్రాయునిపల్లెకు చెందిన రమేష్ భార్య భాగ్యమ్మ(35) సొంత పనులపై ములకలచెరువుకు వచ్చింది. పనులు ముగించుకుని తిరిగి స్వగ్రామానికి వెళ్లేందుకు ములకలచెరువు బస్టాండులో ఆర్టీసీ బస్సు ఎక్కుతుండగా, ప్రమాదవశాత్తు జారి కిందపడింది. తలకు తీవ్ర గాయమై రక్తస్రావం కాగా, గమనించిన స్థానికులు బాధితురాలిని మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. ములకలచెరువు పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు.
దివ్యాంగులకు రాజకీయ
రిజర్వేషన్లు కల్పించాలి
రాయచోటి టౌన్ : దివ్యాంగులకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని రాష్ట్ర దివ్యాంగుల సంఘం అధ్యక్షుడు వంగిమళ్ల రంగారెడ్డి డిమాండ్ చేశారు. శనివారం రాయచోటి పట్టణంలోని మార్కెట్ యార్డులో 66వ ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివ్యాంగులకు ఇచ్చిన సర్టిఫికెట్లను తిరిగి పరిశీలన పేరుతో ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. ప్రజా చైనత్య సేవా సంఘం ప్రాజెక్టు డైరెక్టర్ గడికోట చెన్నారెడ్డి మాట్లాడుతూ దివ్యాంగులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని రకాల పథకాలు అమలు చేయాలన్నారు. అనంతరం జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన దివ్యాంగులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ మాజీ గవర్నర్ కృష్ణదేవరాయులు, సీపీఐ జిల్లా కార్యదర్శి మహేష్, నియోజకవర్గ కార్యదర్శి సిద్దిగాళ్ల శ్రీనివాసులు దితరులు పాల్గొన్నారు.
వివాదాస్పద రస్తా పరిశీలన
సిద్దవటం :మండలంలోని సిద్దవటం రెవెన్యూ సర్వే నంబర్ 16/2 ఆనంద ఆశ్రమం సమీపంలో మామిడి సాగు చేసిన పంట పొలాల్లోకి వెళ్లేందుకు రహదారి లేకుండా ఓ రైతు ఆక్రమించాడని సిద్దవటం తహసీల్దార్ ఆకుల తిరుమలబాబుకు రైతు సిద్దయ్య ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు శనివారం వివాదాస్పద రస్తాను తహసీల్దార్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందులో కొంత భాగం చుక్కల భూమిగా ఉందని రికార్డులు పరిశీలించి రైతులకు న్యాయం చేస్తామన్నారు.
ఆర్టీసీ బస్సులో నుంచి పడి మహిళకు గాయాలు
ఆర్టీసీ బస్సులో నుంచి పడి మహిళకు గాయాలు


