ఇంజినీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య
రాజంపేట : రాజంపేట మండలం బోయనపల్లెలో కె.కీర్తిరెడ్డి (21) అనే ఇంజినీరింగ్ విద్యార్థిని ఊరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు మన్నూ రు పోలీసులు తెలిపారు. అన్నమాచార్య యూనివర్సిటీలో ఆమె బీటెక్ నాలుగో సంవత్సరం చదువుతోంది. ఉదయం పరీక్షలు రాసి వచ్చి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడింది. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజంపేట ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు. కాగా మృతురాలి తండ్రి వెంకటసుబ్బారెడ్డి జీవనోపాధి కోసం కువైట్‌కు వెళ్లారు. బిడ్డ మృతితో తల్లి నిర్మల, సంబంధీకులు కన్నీరు మున్నీరుగా వినిపిస్తున్నారు. కాగా మృతురాలి కుటుంబీకులు పెనగలూరు మండలం పొందలూరు గ్రామానికి చెందిన వారుగా పోలీసులు తెలిపారు.
బైక్‌లో పాము ప్రత్యక్షం
మదనపల్లె రూరల్ : ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో పార్కింగ్‌లో నిలిపి ఉంచిన బైక్‌లో పాము ప్రత్యక్షమైన ఘటన శనివారం జరిగింది. స్థానిక ఆస్పత్రిలో రోగిని చూసేందుకు వచ్చిన ఓ వ్యక్తి ఆస్పత్రి వెనుక వైపు ప్రసూతి విభాగం వద్ద ద్విచక్రవాహనాన్ని నిలిపి లోనికి వెళ్లాడు. అయితే కొంతసేపటికి ఆ బైక్‌లోకి ఓ పాము వెళ్లడం స్థానికులు గమనించారు. విషయం సెక్యూరిటీ సిబ్బందికి చెప్పారు. దీంతో వారు బైక్ సీటు తొలగించి పామును బయటకు వచ్చేలా చేసి చంపేశారు. ఆస్పత్రి పరిసరాల్లో చెట్లు, పొదలు ఉండటంతో పాములు, విషపురుగుల బెడద అధికంగా ఉంది.
బ్రాందీ షాపులో చోరీ
కురబలకోట : మండలంలో అంగళ్లు కదిరి రోడ్డులోని రుద్ర వైన్స్‌లో శుక్రవారం రాత్రి చోరీ జరిగింది. వైన్ షాపుపై ఉన్న రేకును తొలగించి షాపులోకి చొరబడ్డారు. తొలుత ముగ్గురు వ్యక్తులు పథకం ప్రకారం ఈ చోరీకి పాల్పడినట్లు సీసీ ఫుటేజీ ద్వారా వెల్లడవుతోంది. ఇద్దరు బయట కాపలా కాస్తుండగా మరో వ్యక్తి లోపలికి ప్రవేశించి క్యాష్ కౌంటర్‌లోని రూ. 45 వేలు నగదు. ఆరు ఫుల్ బాటిళ్లు మద్యం బాటిళ్లను చోరీ చేసినట్లు సీసీ ఫుటేజీలో కన్పిస్తోంది. బాధితుడు ఆర్సీ కురవపల్లి రుద్ర బాల కృష్ణ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ముదివేడు ఎస్‌ఐ మధు రామచంద్రుడు తెలిపారు.
ఇంజినీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య


