వాయిదా పడిన వైవీయూ డిగ్రీ పరీక్ష నేడే
కడప ఎడ్యుకేషన్: దిత్వా తుపాను కారణంగా వాయిదా పడిన యోగివేమన విశ్వవిద్యాలయ డిగ్రీ పరీక్ష 6వ తేదీ జరగనుందని విశ్వవిద్యాలయ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ కె.ఎస్.వి. కృష్ణారావు తెలిపారు. డిసెంబర్ 1వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు జరగాల్సిన పరీక్ష శనివారం (6వ తేదీ) ఉదయం 9 గంటలకు జరుగుతుందని, ఈ విషయాన్ని విద్యార్థులు గమనించాలని కోరారు.
చిన్నమండెం: చదువుకునే పిల్లల బంగారు భవిష్యత్తే లక్ష్యంగా మెగా పేరెంట్–టీచర్స్ మీట్ (పీటీఎం) నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర రవాణా, యువజన, క్రీడ శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ నిశాంత్‌కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం చిన్నమండెం మండలం మల్లూరు జెడ్పీ హైస్కూల్‌లో మెగా పీటీఎం కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథులుగా హాజరైన మంత్రి, కలెక్టర్‌లు మాట్లాడుతూ గ్రామీణ స్థాయి నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి విద్య అందించాలన్న ధ్యేయమని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి సుబ్రమణ్యం పాల్గొన్నారు.
రాయచోటి: జిల్లా పోలీసు పరెడ్ మైదానంలో హోంగార్డుల ఆటల పోటీలు ఉల్లాసంగా ఉత్సాహంగా జరిగాయి. జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాల మేరకు శుక్రవారం ఆటల పోటీలను నిర్వహించారు. డిసెంబర్ 6వ తేదీన జరగనున్న హోంగార్డ్స్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ పోటీలను జరిపారు. హోంగార్డుల్లో శారీరక దారుఢ్యం, క్రమశిక్షణ, టీమ్ స్పిరిట్‌లను పెంపొందించడానికి ఇవి ముఖ్యమైన వేదికగా నిలుస్తాయని జిల్లా ఎస్పీ అభిప్రాయపడ్డారు. వందమీటర్ల పరుగు పందెం, షాట్‌పుట్, బాలీబాల్, టగ్ ఆఫ్ వార్ వంటి క్రీడలను నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న హోంగార్డులు ఉత్సాహంగా పాల్గొన్నారు. విజేతలుగా నిలిచిన వారికి డిసెంబర్ 6వ తేదీన ఎస్పీ చేతుల మీదుగా బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఐ ఎం పెద్దయ్య, ఆర్‌ఎస్‌ఐలు శ్రీనివాసులు, రవి, అమరనాథ్ రెడ్డి, హోంగార్డ్స్, ఇన్‌చార్జీలు బాలాజీ, రమేష్, లక్ష్మీరెడ్డి, పాల్గొన్నారు.
వాయిదా పడిన వైవీయూ డిగ్రీ పరీక్ష నేడే


