ట్రాన్స్‌ఫార్మర్స్ ఫెయిల్యూర్స్‌పై దృష్టి పెట్టాలి
మదనపల్లె రూరల్: ఏఈఈలు క్షేత్రస్థాయిలోకి వెళ్లి ట్రాన్స్‌ఫార్మర్ల పనితీరును పర్యవేక్షించి, ఫెయిల్యూర్స్‌పై దృష్టి పెట్టాలని ఏపీఎస్పీడీసీఎల్ తిరుపతి సీజీఎం జానకిరాం అన్నారు. శుక్రవారం పట్టణంలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో మదనపల్లె, తంబళ్లపల్లె నియోజకవర్గాలకు సంబంధించి 13 సెక్షన్లలో పనిచేస్తున్న ఏఈఈ, లైన్‌ఇన్స్‌పెక్టర్, లైన్‌మెన్లతో 8 నెలలకు సంబంధించి సెక్షన్ల వారీగా సమీక్షా సమావేశం నిర్వహించారు. సౌరశక్తి వినియోగాన్ని ప్రోత్సహించడం, విద్యుత్ బిల్లులను తగ్గించడం లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన పీఎం సూర్యఘర్ పథకానికి సంబంధించిన ప్రగతిపై అడిగి తెలుసుకున్నారు. లక్ష్యాల సాధనలో వెనుకబడిన సిబ్బందిని పనితీరు మెరుగుపరచుకోవాలని సూచించారు. విధుల్లో నిర్లక్ష్యం చూపితే చర్యలు తప్పవన్నారు. క్షేత్రస్థాయి సిబ్బంది హెడ్ క్వార్టర్స్‌లో కాకుండా పని ప్రదేశంలో నివసించాలన్నారు. సీటీఎం సెక్షన్‌కు సంబంధించి 9 ఫీడర్లు మెయిన్‌టైన్ చేయకపోవడంపై ఏఈ రమేష్‌ను ప్రశ్నించారు. ఐవీఆర్‌ఎస్ ప్రజాభిప్రాయ సేకరణలో సీటీఎం సెక్షన్‌కు సంబంధించి 34శాతం బాగోలేదని ప్రజా స్పందన వచ్చిందన్నారు. కార్యక్రమంలో ఏపీఎస్పీడీసీఎల్ ఎస్‌ఈ సోమశేఖర్‌రెడ్డి, ఈఈ గంగాధరం, ఏడీఈ గోవిందరెడ్డి, సురేంద్రనాయక్, హరికుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఏపీఎస్పీడీసీఎల్ తిరుపతి
సీజీఎం జానకిరాం


