పురిటిబిడ్డ ప్రాణాలు కాపాడిన ప్రభుత్వ వైద్యులు
సుండుపల్లె : మండల కేంద్రంలోని ప్రాథమిక వైద్యశాలలో 5 రోజుల పురిటిబిడ్డ ప్రాణాలను డాక్టర్ దిలీప్‌గుప్తా వైద్యం చేసి కాపాడారు. వివరాలలోకి వెళ్లితే.. మండల పరిధిలోని ఏటిగడ్డ రాచపల్లెకు చెందిన శివ దంపతుల 5 రోజుల చిన్నబిడ్డకు ఇన్‌ఫెక్షన్ ఎక్కువై ప్రాణాపాయ స్థితిలో ఉండగా.. సుండుపల్లె ప్రభుత్వాసుపత్రికి తీసుకుని వచ్చారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న డాక్టర్ దిలీప్‌గుప్తా, ఫర్హానాఖానం మెరుగైన వైద్యం అందించి బిడ్డ ప్రాణాలు కాపాడారు. దీంతో తల్లిదండ్రులు వారికి కృతజ్ఞతలు తెలిపారు.
వాహనం ఢీకొని గేదె మృతి
రామాపురం : మండలంలోని రైతు భరోసా కేంద్రం సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున గుర్తు తెలియని వాహనం ఢీకొని గేదె మృతి చెందింది. దీంతో గేదె యజమాని చప్పిడి లక్ష్మినారాయణ లబోదిబోమని వాపోతున్నాడు. తన కుటుంబం గేదె పాలు విక్రయించి, కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోందన్నారు. రూ.70 వేల విలువ చేసే గేదె మృతి చెందడంతో.. తమకు మరొక గేదెను కొనుగోలు చేయుటకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందివ్వాలని కోరుతున్నాడు.
ఉరి వేసుకుని
యువకుడి ఆత్మహత్య
సంబేపల్లె : మండల పరిధిలోని శెట్టిపల్లె గ్రామంలో రెడ్డిశేఖర్(24) అనే యువకుడు శుక్రవారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథఽనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. గుర్రంకొండ మండలం నగిరిమడుగుకు చెందిన రెడ్డిశేఖర్ రెండు నెలల క్రితం సంబేపల్లె మండలంలోని శెట్టిపల్లె గ్రామం దళితవాడలో బంధువుల ఇంటికి వచ్చాడు. అతను గ్రామ సమీపంలోని చెట్టుకు శుక్రవారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆటో డ్రైవర్‌పై బ్లేడుతో దాడి
మదనపల్లె రూరల్ : ఆటో డ్రైవర్‌పై బ్లేడుతో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడిన ఘటన గురువారం అర్ధరాత్రి మదనపల్లె పట్టణంలో జరిగింది. పుంగనూరు రోడ్డు కనుమలో గంగమ్మగుడి సమీపంలో నివసిస్తున్న శేఖర్‌బాబు కుమారుడు రెడ్డిశేఖర్ ఆటో డ్రైవర్‌గా పని చేస్తూ జీవిస్తున్నాడు. గురువారం రాత్రి చెంబకూరు రోడ్డులోని నాయనమ్మ లక్ష్మీదేవి వద్దకు వెళ్లి తిరిగి ఇంటికి వచ్చే క్రమంలో రాగిమాను వద్ద ఆటో నిలిపి ఉంచాడు. అదే సమయంలో వాల్మీకి వీధికి చెందిన తరుణ్.. రెడ్డిశేఖర్‌తో అమర్యాదగా వ్యవహరించాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వివాదం జరిగింది. ఆగ్రహించిన తరుణ్ మద్యం మత్తులో ఆవేశంతో తన వద్ద ఉన్న బ్లేడుతో రెడ్డిశేఖర్ గొంతుపై కోసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్థానికులు అక్కడికి రావడంతో పరారయ్యాడు. దాడిలో తీవ్రంగా గాయపడిన రెడ్డిశేఖర్‌ను స్థానికులు ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న వన్‌టౌన్ సీఐ మహమ్మద్ రఫీ ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
పురిటిబిడ్డ ప్రాణాలు కాపాడిన ప్రభుత్వ వైద్యులు
పురిటిబిడ్డ ప్రాణాలు కాపాడిన ప్రభుత్వ వైద్యులు


