వేతనాలు లేక ఇబ్బందులు | - | Sakshi
Sakshi News home page

వేతనాలు లేక ఇబ్బందులు

Dec 2 2025 8:30 AM | Updated on Dec 2 2025 8:30 AM

వేతనా

వేతనాలు లేక ఇబ్బందులు

వేతనాలు లేక ఇబ్బందులు త్వరగా డబ్బులు చెల్లించాలి జీవనం కష్టమైంది

నేను, నా భార్య కలసి 70 రోజుల దాకా పనికి వెళ్లాం. ఉపాధి కూలి డబ్బులే జీవనానికి ఆధారం. ఉపాధి పని చేయించుకున్నారు, కానీ వేతనాలు పడకపోవడంతో నానా ఇబ్బందులు పడుతున్నాం. పనికి తగ్గ వేతనం ఇవ్వడం లేదు. తక్షణమే అధికారులు స్పందించి వేతనాలు పడేలా చూడాలి. – ఎస్‌.రవికుమార్‌,

ఉపాధి కూలి, ఉప్పరవాండ్లపల్లి, పీటీఎం మండలం.

మదనపల్లె : ఉపాధి హామీ పథకం పనులతో పొట్ట నింపుకుంటున్న కూలీల కడుపు కొడుతోంది ప్రభుత్వం. ఎప్పటికప్పుడు వీరి వేతనాలు చెల్లించాల్సి ఉండగా అందుకు పూర్తి విరుద్ధమైన పరిస్థితులు నెలకొంటున్నాయి. కూలీకి వెళ్తే వేతనాలోస్తాయని ఉన్న ఊరులో పనులు చేస్తున్నారు ఉపాధి హామీ పథకం కూలీలు. అయితే ప్రభుత్వం వీరికి వేతనాలను సకాలంలో చెల్లించడం మాట దేవుడెరుగు నెలల తరబడి ఇవ్వడం లేదు. దాంతో ఉపాధి కూలీలు పస్తులు ఉండాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి.

15 రోజుల్లో అనేది కాగితాలకే..

ఉపాధిహామీ పథకం ద్వారా కూలీ పనులు చేసిన వారికి 15 రోజులకోకసారి.. లేదంటే అంతకుముందు వేతనాలను వారి ఖాతాలకు జమ చేయాలన్నది చట్ట నిబంధన. అయితే ప్రస్తుతం నెలల తరబడి కూడా అందడంలేదు. దీంతో కూలీ పనులపై ఆధారపడిన వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కో కూలీ రోజుకు నాలుగు నుంచి ఆరు గంటల పాటు పనులు చేయాలి. ఇందుకోసం రూ.307 వేతనం ఇస్తారు. జిల్లాలో ఇలా పనులు చేసిన కూలీల వేతనాలకు సంబంధించి రూ.33.64 కోట్లు, ప్రభుత్వం చేపట్టిన పనులకు సంబంధించి మెటిరియల్‌ చెల్లింపు బిల్లులు రూ.23.05 కోట్లు కలుపుకుని జిల్లా వ్యాప్తంగా రూ.56.69 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. జిల్లాలో అత్యధికంగా రాయచోటి నియోజకవర్గంలో పనులు జరగడం విశేషం. అధిక బిల్లులు పెండింగ్‌లో ఉన్నవికూడా ఇక్కడే. ఈ నియోజకవర్గ కూలీలకు రూ.10.61 కోట్ల వేతనాలు, రూ.6.31 కోట్ల మెటిరియల్‌ బిల్లులు అందాల్సి ఉంది. మండలాల్లో అత్యధికంగా గాలివీడులో రూ.2.91 కోట్ల కూలీసొమ్ము, మెటిరియల్‌ సొమ్ములో సంబేపల్లె మండలానికి 2.07 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి.

జరుగుతున్న పనులు

జిల్లాలో ఉపాధి హామీ పథకం ద్వారా వివిధ పనులు చేస్తున్నారు. ఫీడర్‌ చానళ్లు, ట్రెంచీలు, గృహనిర్మాణాలకు సంబంధించిన పనులు, ఫారంపాండ్లు, బౌండరీట్రెంచీలు, రింగ్‌ ట్రెంచీలు, పశుగ్రాసం పెంపకం, ఉద్యానవన పంటలకు సంబంధించిన పనులు జరుగుతున్నాయి. కూలీలు వస్తున్నారు కాబట్టే ప్రభుత్వం నిర్ణయించిన పనులు సాగుతున్నాయి. వేతనాలు ఐదునెలలుగా పెండిండిలో పెట్టినప్పటికి ఈరోజిస్తారు, రేపిస్తారన్న ఆశతో పనులు కొనసాగిస్తున్నారు.

జూన్‌ నుంచి కూలీ సొమ్ము బకాయి ఉంది. ఇందులో ఈ మధ్య జూన్‌ నెలకు సంబంధించి కూలీసొమ్ము ఖాతాకు జమ అయింది. జూలై ఒకటి నుంచి నవంబర్‌ 30 వరకు రూ.8,500 కూలీ డబ్బును చెల్లించాల్సి ఉంది. ఉపాధి పనులపైనే ఆధారపడ్డాం. డబ్బు త్వరగా చెల్లించాలి. – బి.నాసర్‌వలీ,

బడికాయలపల్లె, బి.కొత్తకోట మండలం

ఉపాధి హామీ పనులతో కుటుంబ పోషణ జరుగుతుంది. చేసిన పనుల కు బిల్లులు రాలేదు. జూలై నుంచి చేసిన పనులకు రూ.6,231 బకాయి డబ్బు రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నాం. వెంటనే వేతనాలు చెల్లించాలి.

– ఆర్‌.జయమ్మ, ఎద్దులవారికోట, తంబళ్లపల్లె

‘ఉపాధి’లో ఆకలికేకలు

జూలై ఒకటి నుంచి

కూలీలకు అందని వేతనం

ఐదు నెలల్లో కూలీలకు సొమ్ము రూ.33.64 కోట్లు

మెటీరియల్‌ బిల్లులు రూ.23.05 కోట్లు

మొత్తం రూ.56.69 కోట్ల బకాయి పడిన ప్రభుత్వం

సొమ్ములు ఎప్పుడిస్తారని ఎదురుచూపులు

ఉపాధి బిల్లుల పెండింగ్‌ (రూ.లక్షల్లో)

మండలం వేతనం మెటీరియల్‌

బి.కొత్తకోట 64.67 46.82

కురబలకోట 53.47 64.81

ములకలచెరువు 122.79 101.81

పెద్దమండ్యం 60.25 18.42

పెద్దతిప్పసముద్రం 80.18 118.15

తంబళ్లపల్లె 90.95 40.09

మదనపల్లె 73.84 182.71

నిమ్మనపల్లె 61.40 28.79

రామసముద్రం 93.42 38.08

కలకడ 81.00 40.11

కలికిరి 114.97 75.54

గుర్రంకొండ 53.47 79.61

కంభంవారిపల్లె 51.88 35.01

పీలేరు 85.67 91.89

వాయల్పాడు 178.74 130.66

చిన్నమండెం 107.23 75.82

గాలివీడు 291.49 160.60

లక్కిరెడ్డిపల్లె 287.76 38.51

రామాపురం 155.97 130.24

రాయచోటి 89.17 19.06

సంబేపల్లె 130.10 207.09

రాజంపేట 120.24 87.36

టి.సుండుపల్లె 225.88 59.37

వీరబల్లి 91.85 69.32

చిట్వేలి 115.80 81.28

కోడూరు 116.69 104.16

నందలూరు 86.63 33.64

ఓబులవారిపల్లె 60.07 60.41

పెనగలూరు 144.76 53.95

పుల్లంపేట 74.15 32.34

రూ.8,500 పెండింగ్‌

వేతనాలు లేక ఇబ్బందులు 
1
1/3

వేతనాలు లేక ఇబ్బందులు

వేతనాలు లేక ఇబ్బందులు 
2
2/3

వేతనాలు లేక ఇబ్బందులు

వేతనాలు లేక ఇబ్బందులు 
3
3/3

వేతనాలు లేక ఇబ్బందులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement