భూమి ఒకచోట.. సాగు మరోచోట!
సిద్దవటం: మండలంలోని శాఖరాజుపల్లె రెవెన్యూ గ్రామ పరిధిలో ఒక వ్యక్తికి అసైన్డ్ భూమి డీకేటీ పట్టాను ఒక సర్వే నంబర్‌లో మంజూరు చేస్తే, మరో సర్వే నంబర్‌లోని ప్రభుత్వ భూమిని సాగు చేసిన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. సిద్దవటం మండలం బాపనపల్లి గ్రామానికి చెందిన మాదు చిన్న వెంకటసుబ్బారెడ్డికి సర్వే నంబర్ 487–1 లెటర్లో 1.50 ఎకరాలు ప్రభుత్వం డీకేటీ భూమిని మంజూరు చేసింది. అలాగే సర్వే నంబర్ 485లో లక్ష్మీదేవి, సుమలతలకు కలిపి 3 ఎకరాల డీకేటీ భూమిని ప్రభుత్వం మంజూరు చేసింది. అయితే సదరు రైతులు వారికి ఇచ్చిన సర్వే నంబర్లలో భూములు సాగు చేసుకోకుండా సర్వే నంబర్ 509, 510లోని ప్రభుత్వ భూమిలో రాత్రికి రాత్రే కంచె వేయడం, చెట్టు నాటడంతో ఈ విషయంపై మూడేళ్ల నుంచి బాపనపల్లి గ్రామ ప్రజలు అడ్డుకుంటున్నారు. దీంతో రెవెన్యూ అధికారులు ప్రభుత్వ భూమిని అన్యాక్రాంతం చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవని సదరు ప్రభుత్వ భూమి సర్వే నంబర్ 509, 510లో హెచ్చరిక బోర్డులను పాతారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే బాపనపల్లి గ్రామానికి చెందిన మాదు చిన్న వెంకటసుబ్బారెడ్డి సదరు ప్రభుత్వ భూమిలోని హెచ్చరిక బోర్డును తొలగించి నిమ్మచెట్లు నాటారు. చిన్న వెంకటసుబ్బారెడ్డిపై రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవాలని బాపనపల్లి గ్రామ ప్రజలు కోరుతున్నారు.
హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేస్తాం..
బాపనపల్లెలో కబ్జాకు గురైన 509, 510 సర్వే నంబర్లలోని ప్రభుత్వ భూమిని సర్వే చేసి మాదు చిన్న వెంకటసుబ్బారెడ్డి ఆక్రమణలను తొలగించి హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేస్తామని సిద్దవటం తహసీల్దార్ ఆకుల తిరుమల బాబు తెలిపారు.
సర్వే నంబర్ 509లో గతంలో రెవెన్యూ
అధికారులు ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డు
కబ్జాకు గురైన ప్రభుత్వ భూమి
భూమి ఒకచోట.. సాగు మరోచోట!
భూమి ఒకచోట.. సాగు మరోచోట!


