జాతీయస్థాయి స్క్వాష్ పోటీలకు సయ్యద్
మదనపల్లె సిటీ: మదనపల్లె మండలం సీటీఎం జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థి పఠాన్ మహమ్మద్ సయ్యద్ అండర్–19 స్కూల్‌గేమ్స్ స్క్వాష్ పోటీలలో ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై నట్లు పాఠశాల హెచ్‌ఎం. చంద్రశేఖర్ తెలిపారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో 4వ సాధించారన్నారు. స్క్వాస్ టటోఈలలో రాణించడానికి కృషి చేసిన వ్యాయామ ఉపాధ్యాయులు నాగరాజు, నరేష్‌బాబులను అభినందించారు.
రాయచోటి జగదాంబసెంటర్: దివ్యాంగులకు అవసరమైన ఉపకరణాల కోసం శుక్రవారం రాయచోటి పట్టణంలోని జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాల ఆవరణంలో గల భవిత కేంద్రంలో ఉదయం 9 గంటల నుంచి నిర్ధారణ పరీక్షలు నిర్వహించనున్నట్లు సమ్మిళిత విద్య జిల్లా సమన్వయకర్త జనార్దన్ ఒక ప్రకటనలో తెలిపారు. 18 సంవత్సరాలలోపు దివ్యాంగులు నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలన్నారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు తమ వెంట సదరం సర్టిఫికెట్, యూడీఐడీ కార్డు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, రెండు పాస్‌పోర్టు సైజు ఫొటోలు తీసుకురావాలన్నారు. యూడీఐ కార్డులులేని వారు సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. నిర్ధారణ పరీక్షల తరువాత దివ్యాంగ పిల్లలకు అవసరమైన బ్యాటరీ సైకిల్, వీల్ ఛైర్, ట్రై సైకిల్, రోలేటర్స్, చంక కర్రలు వంటి ఉపకరణాలు మంజూరు చేయనున్నట్లు తెలిపారు.
రాయచోటి టౌన్: జిల్లా స్థాయిలో నిర్వహించిన సివిల్ సర్వీసెస్ ఉద్యోగుల క్రీడా పోటీలు ముగిశాయని అన్నమయ్య జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి జి. చంద్ర శేఖర్ తెలిపారు. ఈ నెల 11వ తేదీ నుంచి 13వ తేదీ వరకు రాయచోటి మండలం నక్కవాండ్లపల్లె క్రికెట్ స్టేడియంలో ఈ క్రీడా పోటీలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ క్రీడా పోటీలలో అథ్లెటిక్స్, టేబుల్ టెన్నిస్, షటిల్ బ్యాడ్మింటన్, క్రికెట్, చెస్, కబడ్డీ, లాన్ టెన్నీస్, క్యారమ్స్, హాకీ, బాస్కెట్‌బాల్, ఫుట్‌బాల్, ఖోఖో, వెయిట్ లిఫ్టింగ్ అండ్ పవర్ లిఫ్టింగ్, స్విమ్మింగ్, వాలీవాల్, యోగా, బెస్ట్ ఫిజిక్యూ, రెస్టింగ్ (కుసీ్త్ర), డ్యాన్స్ మ్యూజిక్, ష్టార్ట్‌ప్లే విభాగంలో పోటీలు నిర్వహించినట్లు తెలిపారు. రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై న వారు ఈ నెల 19వ తేదీ నుంచి 22 వరకు విజయవాడ, గుంటూరులో జరగనున్న రాష్ట్ర స్థాయి సివిల్ సర్వీసెస్ క్రీడా పోటీలలో పాల్గొంటారని తెలిపారు.
రాయచోటి: న్యూమోనియాను అరికడదాం...పిల్లల బాల్యాన్ని కాపాడుదామని అన్నమయ్య జిల్లా డీఆర్‌ఓ మధుసూదన్ రావు పేర్కొన్నారు. గురువారం రాయచోటి కలెక్టర్ ఛాంబర్‌లో జిల్లా ఇమ్యునైజేషన్ శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. చిన్నపిల్లల్లో న్యూమోనియా రాకుండా చేసేందుకు తగిన సమయంలో టీకాలను అందించడం ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమన్నారు. న్యూమోనియా మరణాలను తగ్గించి పిల్లల బాల్యాన్ని కాపాడి వారి బంగారు భవిష్యత్తుకు పునాది వేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇమ్యునైజేషన్ శాఖ అధికారి ఉషశ్రీ, ఆ శాఖ సిబ్బంది, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
జాతీయస్థాయి స్క్వాష్ పోటీలకు సయ్యద్


