విభిన్న ప్రతిభావంతులను ప్రోత్సహించాలి
రాజంపేట టౌన్: విభిన్న ప్రతిభావంతులను ప్రోత్సహిస్తే అద్భుతాలు సృష్టించగలరని డీఈఓ డాక్టర్ కె.సుబ్రమణ్యం తెలిపారు. పట్టణంలోని మన్నూరు జెడ్పీ ఉన్నత పాఠశాలలో గురువారం విభిన్న ప్రతిభావంతులకు ఉపకరణాల కోసం సమ్మిళిత విద్య సమన్వయకర్త కె.జనార్దన్ ఆధ్వర్యంలో నిర్ధారణ శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డీఈఓ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విభిన్న ప్రతిభావంతులకు విద్య, ఉద్యోగ అవకాశాల్లో ప్రత్యేకంగా రిజర్వేషన్ సౌకర్యం ఉంటుందన్నారు. నిర్ధారణ పరీక్షల శిబిరాన్ని శిక్షణలో ఉన్న ఐఏఎస్ అధికారులు హర్షిత అగర్వాల్, స్వాతిపొగాట్, సుమిత్‌కుమార్‌సింగ్, సుక్‌రామ్, ప్రశాంత్‌సింగ్, మంజునాథ శివప్ప, నిధోని సందర్శించారు. రాజంపేట, నందలూరు, రైల్వేకోడూరు, పెనగలూరు, ఓబులవారిపల్లె, చిట్వేలి, పుల్లంపేట మండలాలకు చెందిన ప్రత్యేక విభిన్న ప్రతిభావంతులు తమకు అవసరమయ్యే ఉపకరణాల కోసం నిర్ధారణ పరీక్షలకు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ–1 కొండూరు రఘునాఽథ్‌రాజు, ఎంఈఓ–2 సుబ్బరాయుడు, పుల్లంపేట ఎంఈఓ నాగ తిరుమలరావు, హెచ్‌ఎం శారద, వైద్యులు శివాసిస్, శివప్రకాష్, ఆడియాలజిస్ట్ మమత, సమ్మిత విద్య ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
డీఈఓ సుబ్రమణ్యం


