నాలుగు రోజులుగా ఎదురు చూపులు...
కిడ్నీ రాకెట్‌లో ప్రాణాలు కోల్పోయిన యమున మృతదేహం కోసం నాలుగు రోజులుగా కుటుంబ సభ్యులు ఎదురుచూస్తున్నారు. మదనపల్లెలో మరణించిన యమున మృతదేహాన్ని గుట్టుచప్పుడు కాకుండా తిరుపతికి తరలించడం, అక్కడి నుంచి మళ్లీ మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తీసుకురావడం, ఒకరోజు తర్వాత పోస్టుమార్టం నిర్వహించేందుకు ఫోరెన్సిక్, యూరాలజీ వైద్యనిపుణులు లేరంటూ తిరిగి తిరుపతి రుయాకు తరలించడం చేశారు. నాలుగోరోజు గురువారం మధ్యాహ్నం ఎట్టకేలకు యమున మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. పోస్టుమార్టంలో యమున శరీరంలో ఎడమ పక్కన కిడ్నీ తొలగించినట్లు వైద్యులు నిర్ధారించారు.


