మదనపల్లె సిటీ : విద్యార్థులు క్రీడల్లోరాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని జిల్లా స్కూల్ గేమ్స్ కార్యదర్శి నాగరాజు అన్నారు. శుక్రవారం స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఉమ్మడి చిత్తూరు జిల్లా అండర్–19 బాల,బాలికల ఫుట్‌బాల్ జట్ల ఎంపిక జరిగింది. విద్యార్థులు తమకు ఆసక్తికలిగిన క్రీడను ఎంచుకుని రాణించాలన్నారు. ఆటలు ఆడటం వల్ల ఆరోగ్యంతో పాటు ఉల్లాసంగా ఉంటారన్నారు.కార్యక్రమంలో ఎంఈఓలు ప్రభాకర్‌రెడ్డి, రాజగోపాల్, హెచ్‌ఎం సుబ్బారెడ్డి, పీడీలు మురళీదర్‌రెడ్డి, సుధాకర్, దేవకమ్మ, అన్సర్, నరేష్, మహేంద్రనాయక్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
అండర్–19 బాలుర ఫుట్‌బాల్ జట్టు:
పి.రేవంత్, డి.నరేష్, జి.రాఘవేంద్ర, వై.వంశీకళ్యాణ్, వి.కార్తీక్,, ఎం.జీవన్‌సాయి, పి.దీక్షిత్‌రెడ్డి, కె.త్రివేది, టి.జాకబ్‌జయంత్, ధామస్, వి.ఉదయ్‌ముని, జి.హరీష్‌భారత్, సి.సుధీర్, పి.మనోజ్‌కుమార్, ఎ కెల్విన్‌కెనత్, డి.శివరంగ్, పి.నికిత్ స్టాండ్‌బైలుగా సాయికిరణ్, ఎన్.జ్యోతిష్‌సాయి, ఎస్.ఇమ్రాన్‌సయ్యద్,పి.యాసర్‌లు ఎంపికయ్యారు.
అండర్–19 బాలికల జట్టు:
ఎన్.విష్ణుప్రియ, కె.నిశ్చిత,జి.హేమశ్రీ, ఎం.తన్మయ, పి.స్వాతి, యు.హారిక, జి.నూతనహర్షవర్థిని, బి.శశికళ,ఎ.హాతిక, జి.హాన్సిక, ఈ.దేవిక,ఎస్.సహనాజ్, జి.పూజిత, కె.నందిని, ఎం.భావ్య, ఎన్.పల్లవి, జె.అనిత, స్టాండ్‌బైలు కె.స్నేహ, ఎస్.తబుసుమ్, జి.మాలతి, కె.శుభశ్రీలు ఎంపికై నట్లు ఎస్‌జీఎఫ్ సెక్రటరీ నాగరాజు తెలిపారు. ఎంపికై నవారు హిందుపురంలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. ఎంపికై వారికి స్తానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నట్లు పీడీలు దేవకమ్మ,అన్సర్, సుదాకర్,జలజ తెలిపారు.
స్కూల్ గేమ్స్ జిల్లా కార్యదర్శి నాగరాజు