
పర్యవేక్షణ శూన్యం.. పచ్చదనం మాయం
ఆంధ్ర భద్రాద్రిగా విరాజిల్లుతున్న ఒంటిమిట్ట కోదండ రామాలయంలో పచ్చదనం మాయమవుతోంది. టీటీడీ అధికారులు పెద్ద ఎత్తున మొక్కలు నాటడంతో పచ్చదనం పరుచుకుంది. ఆలయ పరిసర ప్రాంతంలోని ఎస్సీ బాలుర హాస్టల్ వద్ద పచ్చదనం ఆహ్లాదం కలిగిస్తోంది. మిగిలినవి మొక్కలు స్థానిక సీఎం విడిది గృహం వద్ద ఉంచారు. అయతే పర్యవేక్షణ లేకపోవడంతో ఇక్కడ నిత్యం పశువులు మొక్కలను పాడు చేస్తున్నాయి. మొక్కలను పెంచిన టీటీడీ అధికారులు వాటిని పట్టించుకోకపోవడంతో మొక్కలను పశువులు తినేస్తున్నాయని భక్తులు చెబుతున్నారు.
– ఒంటిమిట్ట

పర్యవేక్షణ శూన్యం.. పచ్చదనం మాయం