
జిల్లాకు స్వచ్ఛాంధ్ర అవార్డులు తీసుకురావాలి
రాయచోటి: ప్రభుత్వం పరిశుభ్రతకు అగ్రస్థానం ఇస్తున్న నేపథ్యంలో స్వచ్చాంధ్ర రాష్ట్ర, జిల్లాస్థాయి అవార్డుల ఎంపికలో నిర్దేశించిన ప్రతి పారామీటర్‌లో వందశాతం అభివృద్ధి సాధించాలని జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్‌తో కలిసి స్వచ్చాంధ్ర అవార్డులపై అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నిర్దేశించిన పనిలో వెనుకబడితే సంబంధిత శాఖలపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇందుకోసం నియోజకవర్గ స్పెషల్ అధికారులు నిర్దేశించిన పారామీటర్లపై లోటు పాట్లను గుర్తించి సంబంధిత శాఖలకు తెలియజేయాలని కలెక్టర్ ఆదేశించారు. కాలక్షేపంగా కాకుండా ఉత్సాహంగా పనిచేస్తే ముఖ్యమంత్రి నుంచి అవార్డు పొందే అవకాశం ఉంటుందన్నారు. అన్ని శాఖలు, అధికారులు సమన్వయంతో కలిసికట్టుగా పనిచేసి స్వచ్ఛ అన్నమయ్య జిల్లాకు శ్రీకారం చుట్టాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో సీపీఓ, డీఈఓ, ఐసీడీఎస్ పీడీ, డీపీఓ, డీఎంహెచ్‌ఓ పాల్గొన్నారు.
కడప ఎడ్యుకేషన్: కడపలోని ఎస్‌కేఆర్ అండ్ ఎస్‌కేఆర్‌లో మహిళా డిగ్రీ కళాశాలలో గురువారం జవహర్ నాలెడ్జ్ సెంటర్ (జేకేసీ) వారు క్యాంపస్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ సలీంబాషా తెలిపారు. అభ్యర్థులు 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, పోస్టు గ్రాడ్యుయేట్ పాసైన వారు ఈ ఉద్యోగాలకు అర్హులన్నారు. అసక్తి ఉన్న అభ్యర్థులు తమ రెజ్యూమ్‌తోపాటు సర్టిఫికెట్స్ జిరాక్స్ కాపీలతో కళాశాల ఆడిటోరియంలో హాజరుకావాలని ప్రిన్సిపాల్ తెలిపారు.

జిల్లాకు స్వచ్ఛాంధ్ర అవార్డులు తీసుకురావాలి