
ప్రేమ విఫలమై యువకుడు ఆత్మహత్య
రాజంపేట : పట్టణంలోని మన్నూరుకు చెందిన జయపాల్ నాయక్(19) సోమవారం ప్రేమ విఫలమై ఆత్మహత్య చేసుకున్నాడు. గతంలో అతను అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం వెంకటపల్లె తండాలో నివాసం ఉండే వాడు. ప్రేమించిన యువతి ఫోన్లో మాట్లాడకపోవడంతో కలత చెంది ఆత్మహత్యకు పాల్పడినట్లుగా సంబంధీకులు పోలీసులకు తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ద్విచక్ర వాహనం చోరీ
పీలేరు : ద్విచక్రవాహనం చోరీకి గురైన సంఘట న సోమవారం రాత్రి పీలేరు పట్టణంలో చోటు చే సుకుంది. రొంపిచెర్లకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ వెంకటేష్ ద్విచక్రవాహనంలో పీలేరు పట్టణం చెన్నారెడ్డివీధికి చెందిన తన స్నేహితుని ఇంటికి వచ్చాడు. తన ద్విచక్రవా హనాన్ని స్నేహితుని ఇంటి ముందు పార్కింగ్ చే శాడు. మంగళవారం ఉదయం ద్విచక్రవాహనం కనిపించక పోవడంతో చోరికి గురైనట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. చెన్నారెడ్డి వీధికి చెందిన మరో ద్విచక్రవాహనాన్ని దొంగలు కొద్ది దూరం తీసుకెళ్లి స్టార్ట్ కాకపోవడంతో వదిలి వెళ్లారు.
గంజాయి విక్రేతల అరెస్ట్
రాజంపేట : మండలంలోని బోయనపల్లె పాత ఎంవీఐ కార్యాలయం వద్ద సోమవారం గంజాయి విక్రయదారులు తోడేటి శేఖర్ (బోయనపల్లె), దార ఈశ్వరయ్య (చీనివారిపల్లె, చింతరాజుపల్లె, ఒంటిమిట్ట)లను అబ్కారీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద 2 కేజీల 150 గ్రాముల ఎండు గంజాయిని, రెండు బైకులను స్వాధీనం చేసుకున్నారు. కడప ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ ఇన్‌స్పెక్టర్, ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ అధికారి జహీర్ అహమ్మద్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. నిందితులను రాజంపేట అబ్కారీ శాఖకు అప్పగించారు.
వృద్ధురాలి మృతి కేసులో ఇద్దరు అరెస్ట్
పెద్దమండ్యం : మనవడి దాడిలో గాయపడిన అవ్వ మృతి చెందిన సంఘటనలో ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు ములకలచెరువు సీఐ లక్ష్మన్న మంగళవారం తెలిపారు. సీఐ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మండలంలోని దిగువపల్లెకు చెందిన ఆర్. లక్ష్మయ్య భార్య నల్లమ్మకు నలుగురు కుమారులు ఉన్నారు. తల్లి పోషణను నలుగురు కుమారులు నెలకు ఒకరు చొప్పున చూసుకునేలా నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో మూడవ కుమారుడు ఆర్.చంద్రశేఖర నాయుడు వంతు రాగా అతని ఇంటికి వెళ్లింది. ఈ విషయమై భర్త చంద్రశేఖరనాయుడు, భార్య భాగ్యమ్మలు గొడవపడ్డారు. భర్తతో గొడవ పడిన విషయాన్ని రాయచోటిలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న కుమారుడు ఆర్.నాగేంద్ర నాయుడుకు తల్లి భాగ్యమ్మ ఫోన్ ద్వారా తెలిపింది. ఇంటికి వచ్చిన అతను అవ్వ నల్లమ్మపై ఇటుకరాయితో దాడి చేశాడు. గాయపడిన నల్లమ్మ తిరుపతి రూయాలో చికిత్స పొందుతూ మృతి చెందింది. సంఘటనపై మరో మనమడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎం వెంకటేశ్వర్లు, సిబ్బంది పీజీ ఖాన్, క్రిషమూర్తి, సిద్దు, శ్రీనివాసులు నాయక్‌లు పాల్గొన్నారు.